/rtv/media/media_files/2025/04/12/wyzDRb574aB2gKPhmifK.jpg)
Court on Netflix
Court on Netflix: నేచురల్ స్టార్ నాని(Nani) సమర్పణలో వచ్చిన 'కోర్ట్: స్టేట్ vs ఏ నోబాడీ' సినిమా మార్చి 14న థియేటర్లలో విడుదలై, భారీ విజయాన్ని అందుకుంది. మాస్ ప్లస్ క్లాస్ కంటెంట్‌కి కంబినేషన్‌గా నిలిచిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
Also Read: ఫ్యాన్స్ కు మెగా ట్రీట్.. 'విశ్వంభర' ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది.
ఈ సినిమాలో మాజీ హీరో శివాజీ పోషించిన మంగపాతి పాత్ర, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. శివాజీ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
Also Read: 'ప్రభాస్'ని పక్కన పెట్టి అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ..!
మంగపతి మీ ఇంటికొచ్చేస్తాడు..!
తాజాగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలైంది. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో మంగపతి గెటప్‌లో కనిపించిన శివాజీ, తన స్టైల్లో మాట్లాడుతూ, “సినిమాలు చూసే జనాలని నేను మార్చలేకపోవచ్చు... కానీ వాళ్లే చూసే కంటెంట్‌ని మాత్రం మార్చగలనండి. కోర్ట్‌ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో చూడండి. ఇకపై మంగపతి మీ ఇంటికొచ్చేస్తాడు,” అంటూ ఆసక్తి పెంచారు.
Also Read: మహేష్ బాబుతో శవాల ముందు డ్యాన్స్ వేయిస్తా..!
ఈ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవి అప్పాల, రోహిణి, సాయికుమార్, ప్రియదర్శి, హర్షవర్ధన్ లాంటి నటులు ముఖ్యపాత్రల్లో నటించారు. కొత్త దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన ఈ సినిమాను ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. సంగీతాన్ని విజయ్ బుల్గానిన్ అందించారు.
Also Read: ఇలా అయితే ఎలా బేబీ.. జాగ్రత్తగా ఉండాలిగా..!
ప్రేక్షకులను ఆలోచనలో పడేసే కథతో వచ్చిన ఈ కోర్ట్ డ్రామా ఇప్పుడు ఓటిటీలో మరింత క్రేజ్‌ను సంపాదించనుంది.
Mangapati court ni mee intike theeskosthunnadu!
— Netflix India South (@Netflix_INSouth) April 11, 2025
Watch Court: State vs A Nobody, now on Netflix in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam.#CourtOnNetflix pic.twitter.com/orNhGZW2UP