/rtv/media/media_files/2025/01/02/a3FYChzxiuxkzhv96cYD.jpg)
ssmb29
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ SSRMB. రాజమౌళి డైరెక్షన్‌లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా ఈ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. జనవరి 2న ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసారు.
Also Read:Summer Effect: భగభగమంటున్న భానుడు..రానున్న 15 రోజులు జర జాగ్రత్త.. అధికారుల హెచ్చరికలు!
ఇక ఈ సినిమా క్యాస్టింగ్ పై పూర్తి శ్రద్ద పెట్టాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఈ సినిమాలో మహేశ్ తో పాటు మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ పేర్లు వినిపించాయి. కానీ అలాంటిదేమి లేదని పృథ్వీరాజ్ క్లారిటీ ఇచ్చాడు. ఇక మహేశ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ లో పెరిగి హాలీవుడ్ లో సెటిల్ అయిన ప్రియాంక చోప్రాను తీసుకున్నారని టాక్ చాలా గట్టిగానే వినిపించింది.
లేడీ విలన్ గా...
ఇటీవల రాజమౌళి కీరవాణీతో దిగిన ఫోటో కూడా నెట్టింట వైరల్ గా మారడంతో అభిమానులు కూడా సినిమా మొదలైందని ఫిక్స్ అయిపోయారు. అయితే అందరూ అనుకున్నట్టు ప్రియాంక హీరోయిన్ కాదట. విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రియాంక చోప్రా ఈ సినిమాలో లేడీ విలన్ గా యాక్ట్ చేస్తుందంట .అందుకు సంబందించిన లుక్ టెస్ట్ కూడా పూర్తి చేశారట. ఈ సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీని తీసుకునేందుకు మూవీ టీమ్ పరిశీలిస్తుందని సమాచారం. బాలీవుడ్ స్టార్ నటుడు జాన్ అబ్రహం ను ఈ పాన్ ఇండియా సినిమాలో ఓ ప్రత్యేక రోల్ కోసం సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తుంది.
Also Read:Horoscope Today: నేడు ఈ రాశి వారు ఉద్యోగ రంగంలో ముందుకు దూసుకుపోతారు!