/rtv/media/media_files/2025/02/04/CFSvEifRoTltMvfrKBqV.jpg)
Top 10 Power Countries List Released by Forbes
2025 ఏడాదికి సంబంధించి ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాను ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ లిస్టులో అమెరికాలో మొదటిస్థానంలో నిలచింది. చైనా, రష్యా వరుసగా రెండు, మూడు స్థానాల్లో చోటు సంపాదించాయి. రాజకీయ, ఆర్థిక, సైనిక బలం వంటి వివిధ అంశాల ఆధారంగా ప్రపంచంలోనే టాప్ 10 అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. సైనిక శక్తిలో భారత్ నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ.. టాప్ 10లో మనకు చోటు దక్కలేదు. భారత్‌కు 12వ స్థానంలో నిలిచింది.
Also Read: మెక్సికో, కెనడాకు బంపరాఫర్ ఇచ్చిన ట్రంప్ ..నెల రోజుల పాటు ఇక ఆ కష్టాలు ఉండవు!
టాప్ 10 శక్తిమంతమైన దేశాలు ఇవే
- యునైటెడ్ స్టేట్స్,30.34 ట్రిలియన్ డాలర్ల జీడీపీ
2. చైనా: 19.53 ట్రిలియన్ డాలర్ల జీడీపీ
3. రష్యా: 2.2 ట్రిలియన్ల డాలర్ల జీడీపీ
4. యునైటెడ్ కింగ్‌డమ్: 3.73 ట్రిలియన్ల డాలర్ల జీడీపీ
5. జర్మనీ: 4.92 ట్రిలియన్ల డాలర్ల జీడీపీ
6. దక్షిణ కొరియా:1.95 ట్రిలియన్ల డాలర్ల జీడీపీ
7. ఫ్రాన్స్: 3.28 ట్రిలియన్ల డాలర్ల జీడీపీ
8. జపాన్: 4.39 ట్రిలియన్ల డాలర్ల జీడీపీ
9. సౌదీ అరేబియా: 1.14 ట్రిలియన్ల డాలర్ల జీడీపీ
10. ఇజ్రాయెల్: 550.91 ట్రిలియన్ల డాలర్ల జీడీపీ
ప్రస్తుతం అమెరికా ప్రపంచంలో ఆధిపత్య శక్తిగా కొనసాగుతోంది. సాంకేతికత, ఆర్థి, వినోదం వంటి రంగాల్లో రాణిస్తోంది. రెండో స్థానంలో ఉన్న చైనా కూడా ఏఐ, 5జీ వంటి సాంకేతిక పురోగతిలో ముందుంది. ఇక రష్యాలో భౌగోళిక రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉంది. అంతేకాదు రష్యా సొంతంగా అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తోంది.
Also Read: జాతీయ క్రీడల్లో భారీ కుంభకోణం.. బంగారు పతకాలు అమ్ముకున్న డైరెక్టర్!