Horoscope Today: నేడు ఈ రాశి వారు ఉద్యోగ రంగంలో ముందుకు దూసుకుపోతారు!

వృశ్చిక రాశి వారు ఈరోజు నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు.తుల రాశి వారు ఈరోజు ఆరోగ్యం గురించి జాగ్రత్త పడటం మంచిది. సింహా రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది.మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..

New Update
Horoscope

Horoscope

మేష రాశి వారు ఈరోజు బంధు,మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ద అవసరం.శారీరక శ్రమతోపాటు మానసిక ఆందోళన తప్పదు.

వృషభ రాశి వారు ఈరోజు ఇతరులకు ఇబ్బందిని కలగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది.వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు.మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం.నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు.

Also Read: ChatGPT:అందుబాటులోకి చాట్‌ జీపీటీ వాట్సాప్‌ లో మరో కొత్త సదుపాయం!

మిథున రాశి వారికి ఈరోజు ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు.ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది.అజీర్ణ బాధలు అధికమవుతాయి. 

కర్కాటక రాశి వారికి ఈరోజు ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి,ఉద్యోగ రంగాల్లో అభివృద్ది ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయ ప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి.

సింహా రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది.స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవపట్టించేవారి మాటలు వినకూడదు.క్రీడాకారులు, రాజకీయ రంగాలల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది.

Also Read: Jeeth Adani: నాకు పెళ్లి అవుతుంది..ఇప్పటికైనా నా ప్రొఫెల్‌ ని తీసేయండిరా బాబు...అదానీ చిన్న కుమారుడి స్పెషల్‌ రిక్వెస్ట్‌!

కన్య రాశి వారు ఈరోజు మనో ధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం.నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి.కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠినసంభాషణ వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో...

తుల రాశి వారు ఈరోజు ఆరోగ్యం గురించి జాగ్రత్త పడటం మంచిది.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది.కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు.

వృశ్చిక రాశి వారు ఈరోజు నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి.

ధనస్సురాశి వారు ఈరోజు పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు.అధికారులతో గౌరవం అందుకుంటారు.పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు.అనారోగ్య బాధలు తొలగిపోతాయి.ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది.

మకర రాశి వారికి  ఈరోజు అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది.ఆకస్మిక ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడటం మంచిది. మనస్తాపానికి గురవుతారు.

కుంభ రాశి వారికి ఈరోజు బంధు మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు.అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థినమైన నిర్ణయాలు తీసుకోలేరు.

మీన రాశి వారు ఈరోజు నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యంసంపూర్ణంగాఉంటుంది. మిత్రులతో కలిసి విందులు,వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. 

Also Read: Bhutan King In Prayagraj: కుంభమేళాలో భూటాన్ దేశ రాజు గంగా హారతి పూజ

Also Read: Hema Malini: కుంభమేళా తొక్కిసలాట ఘటనపై బీజేపీ ఎంపీ హేమామాలిని వివాదస్పద వ్యాఖ్యలు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు