/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Summer-jpg.webp)
Telangana: తెలంగాణలో భానుడు భగభగమంటున్నాడు.ఫిబ్రవరి మొదటి వారంలోనే రికార్డు స్థాయిలో ఎండలు ఇరగదీస్తున్నాయి. సాధారణంగా జనవరి చివరి వారం, పిభ్రవరి నెలలో చలి తీవ్రత కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే గత వారం రోజులుగా వాతావరణ పరిస్థితుల్లో భిన్నమైన మార్పులు కనపడుతున్నాయి. ఎండాకాలం మాదిరిగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రాత్రి సమయాల్లోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటున్నాయి.
విపరీతమైన వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. చలి తీవ్రత తగ్గడంతో సోమవారం ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఈ రెండు జిల్లాల్లోనూ 36.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. భద్రాచలంలో 35.6 డిగ్రీల సెల్సియస్, మెదక్‌లో 34.8 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్‌లో ఇప్పుడే పగటిపూట ఉష్ణోగ్రతలు 34 నుండి 37 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రాత్రి సమయంలో 13 నుండి 22 డిగ్రీలు నమోదవుతున్నాయి.
Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారు ఉద్యోగ రంగంలో ముందుకు దూసుకుపోతారు!
రానున్న 15-20 రోజులు...
ఇది సాధారణంగా ఎండాకాలంలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు.రాబోయే రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రానున్న 15-20 రోజులు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుదన్నారు. వచ్చే వారం నుంచి ఉష్ణోగత్రలు 2 నుండి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నారు. పెరిగి ఎండల నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఈ పొడి వాతావరణం కారణంగా అలర్జీలు వచ్చే ఛాన్స్ ఉందని అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.
ఇదిలా ఉండగా.. ఎండల తీవ్రత కారణంగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది . సాధారణంగా శివరాత్రి తర్వాత అంటే మార్చ్ నెలలో వేసవి ప్రారంభం కావాలి. కానీ ఈసారి అందుకు పూర్తి భిన్నంగా జనవరి చివరి వారం నుంచే ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరిలోనే భానుడి భగభగలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పెరిగిన ఎండల తీవ్రతతో ప్రజలు బయట తిరిగేందుకు హడలిపోతున్నారు. ఇక రాత్రి సమయంలో ఉక్కపోత పెరిగి.. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం బాగా పెరిగింది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉండే నడి వేసవిలో ఎండలు ఇంకే స్థాయిలో ఉంటాయోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.