Samantha: జాగ్రత్తగా చూసుకున్నాడు...మా బంధానికి పేరు పెట్టలేను...సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఇటీవలే ఓ ఈవెంట్ లో నటి సమంత సామ్ తన ఫ్రెండ్ నటుడు రాహుల్ రవీంద్ర ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాహుల్ అనేక సందర్భాల్లో తనకు అండగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. రాహుల్ తో తనకున్న బంధానికి పేరు పెట్టలేను అంటూ అతడిపై ఉన్న అభిమానాన్ని వ్యక్తపరిచింది.

New Update
samantha pic

samantha pic

Samantha  నటి సమంత ఇటీవలే కోలీవుడ్ లో జరిగిన గోల్డెన్ క్వీన్ అవార్డుల కార్యరామంలో గోల్డెన్ క్వీన్ అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా సామ్ వేదికపై మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణం, వ్యక్తిగత అనుభవాల గురించి పంచుకుంది. ఈ క్రమంలో తన జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి  పలు ఆసక్తికర విషయాలను చెప్పింది. అతడు తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని, తమ బంధానికి పేరు పెట్టలేనని ఎమోషనల్ అయ్యింది సామ్. ఇంతకీ అతడు ఎవరు అని ఆలోచిస్తున్నారా? అయన మరెవరో కాదు సామ్ బెస్ట్ ఫ్రెండ్ నటుడు రాహుల్ రవీంద్ర. 

Also Read :  Hafiz Saeed : మాకు నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపుతాం...మోదీకి హఫీజ్ వార్నింగ్!

Also Read :  TG Crime: నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..

మా బంధానికి పేరు పెట్టలేను 

సామ్ రాహుల్ రవీంద్ర గురించి ప్రస్తావిస్తూ.. రాహుల్ అనేక సందర్భాల్లో తనకు అండగా నిలిచారని గుర్తుచేసుకుంది. తనకు ఆరోగ్యం బాగోలేని క్లిష్ట సమయంలో కూడా తోడున్నాడని చెప్పుకొచ్చింది. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు రాహుల్ తనతోనే ఉంటూ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడని తెలిపింది. రాహుల్ తో నా బంధానికి పేరు పెట్టలేను... స్నేహితుడా, సోదరుడా, కుటుంబ సభ్యుడా అనేది చెప్పలేను అంటూ రాహుల్ పై తన అభిమానాన్ని వ్యక్తపరిచింది. సామ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read :  'క' మూవీ మరో ఘనత .. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి నామినేషన్

Also Read :  National Herald Case: ఈడీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్..  సోనియా, రాహుల్ లకు భారీ ఊరట!

latest-news | cinema-news | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | tollywood | latest tollywood updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు