/rtv/media/media_files/2025/04/25/ADu1bH3dVuXsW8IZOhYo.jpg)
ed-sonia
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతరులకు భారీ ఊరట లభించింది. వారికి నోటీసులు ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అందుకు కోర్టు నిరాకరించింది. కొత్త చట్ట నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా ఛార్జిషీట్ తీసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో తదుపరి విచారణను మే 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో మరిన్ని సంబంధిత పత్రాలను తీసుకురావాలని కోర్టు ఈడీని కోరింది. వాటిని పరీక్షించిన అనంతరం నోటీసుల జారీపై నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది.
Also Read : పెళ్లికెళ్తే చచ్చేంతపనైంది.. తేనెటీగల దాడిలో స్పాట్‌లోనే 50 మంది!
🚨 BIG BLOW to BJP & Bhakts! 🚨
— Amar Singh Chouhan (@amar_4inc) April 25, 2025
Delhi court SLAMS ED, refuses to issue notice against Rahul & Sonia Gandhi in National Herald case!
Court demands MORE DOCUMENTS before any action.
RW’s premature celebrations just backfired HARD! 🔥🔥#NationalHeraldCase #RahulGandhi… pic.twitter.com/ryZTUjtc07
Also Read : భద్రతా బలగాలకు మావోయిస్టు అగ్రనేత లేఖ
సీబీఐ విచారణ మధ్యలోనే
కాగా నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను ఈడీ అధికారులు గతంలో చాలు సార్లు విచారణకు పిలిపించి విచారించారు. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారన్న ఆరోపణలు రావడంతో దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. అయితే సీబీఐ విచారణ మధ్యలోనే అగిపోయినప్పటికీ ఈడీ మాత్రం దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది.
ఈ కేసులో 2023 నవంబరులో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే వారిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే ఈ కేసులో సోనియా, రాహుల్ గాంధీలతో పాటుగా ఆ పార్టీకి చెందిన నేతలు శామ్ పిట్రోడా, సుమన్ దుబే పేర్లతో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లయింట్ దాఖలు చేశారు.
Also Read : నారాయణ విద్యార్థి సూసైడ్.. సబ్జెక్టు ఫెయిల్ అయినందుకు ప్రిన్సిపాల్ వేధింపులు..
Also Read : విడదల రజనికి ఏపీ హైకోర్టులో భారీ ఊరట!
telugu-news | Rahul Gandhi | sonia-gandhi | delhi-court