KA Movie 'క' మూవీ మరో ఘనత .. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి నామినేషన్

కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ 'క' చిత్రం దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్  ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుకి నామినేట్ అయ్యింది. ఉత్తమ చిత్రం విభాగంలో నామినేట్ చేయబడింది. ఈనెల చివరిన ఢిల్లీలో అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. 

New Update

KA Movie గతేడాది చిన్న సినిమాగా విడుదలైన బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన కిరణ్ అబ్బవరం 'క' మరో ఘనత తన ఖాతాలో వేసుకుంది. 15వ 'దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్  ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల జాబితాను విడుదల చేయగా.. 'క' ఉత్తమ చిత్రం విభాగంలో ఈ అవార్డుకి నామినేట్ అయ్యింది. ఈ నెల 25న ఢిల్లీలో అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది. 

ఎలాంటి అంచనాలు లేకుండా 

సుజీత్, సందీప్ దర్శకత్వంలో 1970 బ్యాక్ డ్రాప్ లో మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విమర్శకులు, సినీ విశ్లేషకుల నుంచి పాజిటివ్ రివ్యూలు దక్కించుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వారం రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 50 కోట్ల వసూళ్లను సాధించింది. పలువురు సెలెబ్రెటీలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇందులో కిరణ్ ఒక డిఫరెంట్ రోల్లో కనిపించి ఆకట్టుకున్నారు. రూల్స్ రంజన్, మీటర్ వంటి సినిమాలతో వరుస ప్లాపులు చూసిన కిరణ్ 'క' మూవీతో సూపర్ హిట్ కొట్టారు.

కానీ, ఈ సక్సెస్ కంటిన్యూ చేయలేకపోయారు. ఈ సినిమా తర్వాత విడుదలైన 'దిల్ రూబా' డిజాస్టర్ టాక్ మూటకట్టుకుంది.విశ్వ కరణ్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది. ప్రస్తుతం కిరణ్ కే- ర్యాంప్ అనే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నారు. 

telugu-news | kiran-abbavaram | latest-news | cinema-news | ka-movie

Also Read: Raja Saab Update: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్‌డేట్ ఆన్‌ ది వే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు