Mana Shankara Vara Prasad Garu Movie Review: మన శంకర వరప్రసాద్ గారు మెప్పించారా? లేదా?

సక్సెస్‌పుల్‌ డైరెక్టర్‌ అనిల్ రావిపూడి మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం మన శంకర వరప్రసాద్‌ గారు. వారిద్దరి కాంబినేషన్‌ అనగానే ప్రేక్షకుల్లో ఒక విధమైన అంచనాలు ఉండటం సహాజం. అందులోనూవెంకటేశ్‌ ప్రత్యేక పాత్రలో కనిపించడంతో సినిమా రేంజ్ పెరిగింది.

New Update
WhatsApp Image 2026-01-12 at 9.09.17 AM

mana shankara vara prasad garu movie review

వరుస విజయాలతో సక్సెస్‌పుల్‌ డైరెక్టర్‌గా ఉన్న అనిల్ రావిపూడి మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi - Anil Ravipudi) హీరోగా తెరకెక్కిన చిత్రం మన శంకర వరప్రసాద్‌ గారు. వారిద్దరి కాంబినేషన్‌ అనగానే ప్రేక్షకుల్లో ఒక విధమైన అంచనాలు ఉండటం సహాజం. అందులోనూ వెంకటేశ్‌(venkatesh) ప్రత్యేక పాత్రలో కనిపించడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. పోయినేడాది సంక్రాంతికి  “సంక్రాంతికి వస్తున్నాం” తో బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఈ సినిమా మీదా కూడా అదే అంచనాలు కూడా ఏర్పడ్డాయి.  చిరు కెరీర్‌లో 157వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ అప్పియరెన్స్ సినిమాను నడిపించిందా? లేదా? ఇంతకీ మన శంకర వరప్రసాద్‌ గారు మెప్పించారా? లేదా అనే విషయాన్ని చూద్దాం.

Mana Shankara Vara Prasad Garu Movie Review


మన శంకర వరప్రసాద్‌ గారు మూవీని చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల, నిర్మాత సాహు గారపాటి తమ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, షైన్ స్క్రీన్ బ్యానర్లపై నిర్మించారు. భీమ్స్ సిసిరీలియో సంగీతం సమకూర్చారు. అలానే లేడి సూపర్ స్టార్ నయనతార(actress-nayanthara) హీరోయిన్ గా నటించగా.. కేథరిన్(catherine-tresa) ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమాలు ఇప్పటివరకు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాలు సాధించడంతో ఈ సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగాయి.అనిల్ రావిపూడి సినిమాల్లో కథ, కథలో లాజిక్స్ కంటే స్క్రీన్‌ప్లే, అంతకుమించిన ఓ మ్యాజిక్ ఉంటుంది. ఇప్పటివరకూ ఆయన తీసిన ఏ సినిమా చూసినా కథలో పెద్దగా ఫ్రిక్షన్, మలుపులు అలాంటివేం ఉండవ్. కానీ ఆడియన్స్‌ని థియేటర్లకి రంపించే మ్యాజిక్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు 'మన శంకరవరప్రసాద్ గారు'తో అదే రిపీట్ చేశారు అనిల్.

Also Read :  హద్దులు దాటిన అభిమానం..! ‘ది రాజాసాబ్’ థియేటర్ లో ఫ్యాన్స్ అత్యుత్సాహం..

కథలోకి వెళ్తే...

ప్రసాద్ (చిరంజీవి) ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. ఆయన భార్య శశిరేఖ (నయనతార), అయితే వారిద్దరూ కొన్ని కారణాల వల్ల విడిపోతారు. శశిరేఖ తండ్రి జీవీఆర్‌ పెద్ద వ్యాపారవేత్త. నిజానికి వీరు విడిపోవడానికి కారణం శశిరేఖ తండ్రే అన్నది కథనం. శంకరవరప్రసాద్ శశిరేఖ ఇద్దరూ తొలిచూపులోనే ఇష్టపడతాడు..ఆమె కూడా ఇష్టపడడంతో మూడు ముళ్లూ పడిపోతాయి. ఒక డ్యూయెట్ పాడుకునే లోపు ఇద్దరికీ ఇద్దరు పిల్లలు పుడుతారు. అయితే తన ఆస్తి, ఐశ్వర్యం అన్నీ వదిలేసి ప్రసాద్‌తో తన కూతురు వెళ్లిపోయిందనే కోపంతో శశిరేఖ తండ్రి జీవీకే అల్లుడు-కూతుర్ని తన కుట్రలతో విడదీసి డైవర్స్ ఇప్పించేస్తాడు. ప్రసాద్-శశిరేఖల పిల్లలు ఒక హిల్ స్టేషన్ లోని రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతుంటారు. వాళ్లకి దగ్గరావ్వలని, వాళ్ల ద్వారా మళ్లీ శశిరేఖతో జీవితం గడపాలని ప్రసాద్ ఆలోచన. ఈ లోపు జీవీఅర్ కి ఒక గుర్తుతెలియని ముఠా నుంచి ప్రాణాపాయం పొంచి ఉందని తెలుస్తుంది. దాంతో ఒక పథకం ప్రకారం ఆ కుటుంబానికి రక్షణ కలిపించేందుకు వెళ్తాడు ప్రసాద్. అక్కడి నుంచి ఏమౌతుంది? ప్రసాద్-శశిరేఖలు కలుస్తారా ? అసలు వాళ్లు ఎందుకు విడిపోయారు. తిరిగి తన శశిరేఖని ఎలా కలుసుకున్నాడు.. ఈ ఫ్యామిలీ కథ ఎలా సుఖాంతమైంది అనేదే మిగిలిన కథ. ఇక ఈ కథలో వెంకీ గౌడ (వెంకటేష్) పాత్ర ఏంటి..? శశిరేఖని, ఆమె పిల్లల్ని ఎవరు చంపాలనుకున్నారు? అనేది తెరపై చూడాల్సిందే.ఇదంతా కథ.

కథ పరంగా మన శంకరవరప్రసాద్ గారు చాలా రొటీన్ మూవీ. కానీ అనిల్ రావిపూడి(anil-ravi-pudi) సినిమాలలో కథ కంటే ఎక్కువగా కథనం బాగుంటుంది. ఈసారి కూడా నో లాజిక్.. ఓన్లీ వింటేజ్ మెగా మ్యాజిక్ చేయడంలో సక్సెస్ కొట్టారు. ఈ జనరేషన్ దర్శకులలో చిరంజీవిని బాగా వాడుకుంది అనిల్ అని చెప్పొచ్చు. మెగాస్టార్ కామెడీ టైమింగ్ చూసి ఎన్నో ఏళ్లు దాటిపోయింది. మధ్యలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ వచ్చాయి కానీ కామెడీ మాత్రం లేని లోటు ఇప్పుడే అనిల్ తీర్చేశాడు. ఫస్టాఫ్ లోనే ఫుల్ పైసా వసూల్ అయిపోయింది. పంచ్ డైలాగులు, సెల్ఫ్ సెటైర్లు, చిరు మోడ్యులేషన్స్ తో మెప్పించారు. ఇక చిరంజీవి కూడా ఎంత ఆకలి మీద ఉన్నాడో అని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. జస్ట్ టైం గ్యాప్ అంతే టైమింగ్ లో అస్సలు గ్యాప్ ఉండదని స్క్రీన్ మీద రఫ్ ఆడించాడు. ఒక్కొక్క సీనులో ఫస్టాఫ్ అయితే హిలేరియస్.. సెకండ్ హాఫ్ అక్కడక్కడ కాస్త తగినట్టు అనిపిస్తుంది కానీ చివర్లో వెంకటేష్ వచ్చాక స్క్రీన్ దద్దరిల్లిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే శంకరవరప్రసాద్ గా తన ఆకలి మొత్తం తీర్చేసుకున్నాడు బాస్. హుక్ స్టెప్, మెగా విక్టరీ సాంగ్స్ విజువల్ గా అదిరిపోయాయి.

Also Read :  నెగటివ్ రివ్యూలకు టాలీవుడ్‌ చెక్.. ఐడియా అదిరింది గురు!

మెగాస్టార్ చిరంజీవికి  ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ దొరికితే మళ్లీ ఎలా స్క్రీన్ మీద నవ్వులు పూయిస్తారో ఇప్పుడు మరోసారి నిరూపించారు. చిరంజీవి కామెడీ టైమింగ్ మీద, ఆయన డ్యాన్స్ స్టెప్పుల మీద, ఆయన పాత సినిమాలని.. పాటల్ని గుర్తు చేసేలా కథనం నడిపాడు. కామెడీ, రొమాన్స్, విలన్లు, ఫైట్లు..ఇలా అన్నీ ఉంటేనే అన్ని దినుసులు వేసిన సంక్రాంతి పిండివంటకం అవుతుందనే ఫార్ములాతో అవన్నీ పెట్టేసాడు.  నయనతార తన పాత్రలో నిండుగా ఉంది. గ్లామర్, నటన రెండూ కలగలిపి మెగాస్టార్ సరసన సరిగా సరితూగింది. ప్రధమార్ధంలో సైగలతో చిరంజీవితో చేసే రొమాన్స్ కూడా ఆకట్టుకుంటుంది. వెంకటేష్ ఉన్నది 20 నిమిషాలైనా కూడా అదరగొట్టాడు. నయనతార కూడా చాలా అందంగా ఉంది. కేథరిన్ త్రెసా, సచిన్ ఖేడ్ కర్, బుల్లి రాజు, అభినవ్ గోమటం, హర్షవర్ధన్ ఎవరికి వాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్.. దర్శకుడు అనిల్ రావిపూడి మరొసారి తన టాలెంట్ నిరూపించుకున్నారు. పాత కథను కూడా తన మార్క్ ఎంటర్టైన్మెంట్ పద్ధతిలో మెప్పించారు. భీమ్స్ మ్యూజిక్ తో అదరగొట్టారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీతో మెప్పించారు. నిర్మాతలు ఎక్కడా తగ్గకుండా పూర్తి స్థాయి న్యాయం చేశారు.సంగీతం పరంగా మీసాల పిల్ల, శశిరేఖ, హుక్ స్టెప్, చిరంజీవి-వెంకటేష్ మీద తీసిన పార్టీ సాంగ్ అన్నీ చూడ్డానికి బాగున్నాయి. మిగిలిన సాంకేతిక విలువలు, నిర్మాణ విలువలు అన్నీ ఘనంగానే ఉన్నాయి.  - Tollywood news updates

Advertisment
తాజా కథనాలు