/rtv/media/media_files/2025/07/26/lavanya-tripati-baby-bump-2025-07-26-13-25-08.jpg)
Lavanya tripati baby bump
మెగా కపుల్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ప్రస్తుతం 'బేబీమూన్' వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే మాల్దీవ్స్ వెకేషన్ వెళ్లిన ఈ జంట.. నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో లావణ్య బేబీ బంప్ తో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. లావణ్య- వరుణ్ మరికొన్ని నెలల్లో తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకబోతున్నారు. షూటింగ్ బిజీలో కూడా వరుణ్ లావణ్య కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తున్నారు. ఖాళీ దొరికినప్పుడల్లా భార్యతో టైం స్పెండ్ చేయడం, వెకేషన్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read : తెలంగాణలో మరో రెండు రోజులు దంచికొట్టనున్న వర్షాలు! ఆ జిల్లాలకు హై అలెర్ట్..
ఇదిలా ఉంటే వరుణ్.. అప్పుడే తన పుట్టబోయే బిడ్డ కోసం షాపింగ్ కూడా మొదలు పెట్టారు. ఇటీవలే లావణ్య షేర్ చేసిన ఓ ఫొటోలో బేబీకి బ్లాంకెట్ సెలెక్ట్ చేస్తూ కనిపించాడు. ఈ ఫొటో నెటిజన్లను, అభిమానులను ఫిదా చేసింది. ఇది చూసిన వారంతా.. 'సో క్యూట్' అంటూ కామెంట్లు చేశారు. వరుణ్- లావణ్య 2023లో ఇటలీలో గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.
Also Read : టీచర్ల వేధింపులు.. మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్య
వరుణ్ సినిమాలు
ఇక వరుణ్ సినిమాల విషయానికి వస్తే.. తన రాబోయే చిత్రం VT15 మ్యూజిక్ సిట్టింగ్స్‌లోబిజీగా ఉన్నారు. ఇండో- అమెరికన్ హారర్ కామెడీ నేసథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి మెర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. VT15 షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్, అనంతపురంలలో రెండు షెడ్యూల్స్ పూర్తి పూర్తి చేయగా.. ప్రస్తుతం కొరియాలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
Also Read: Hari Hara Veera Mallu Collections Day 2: వీర మల్లుకు షాక్.. తొలి రోజు సునామీ.. రెండో రోజు సైలెంట్!
lavanya-tripati | varun tej | latest-telugu-news | telugu-film-news | telugu-cinema-news | latest tollywood updates | tollywood-actor | tollywood-actress