Hari Hara Veera Mallu Collections Day 2: వీర మల్లుకు షాక్.. తొలి రోజు సునామీ.. రెండో రోజు సైలెంట్!

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ 'హరిహర వీరమల్లు' జులై 26న థియేటర్స్ లో విడుదలైంది. తొలి రోజు బలమైన ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగించగా.. రెండవ రోజు ఈ సినిమా వసూళ్లు  గణనీయమైన తగ్గుదల కనిపించింది.

New Update

Hari Hara Veera Mallu Collections Day 2:  పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ 'హరిహర వీరమల్లు' జులై 26న థియేటర్స్ లో విడుదలైంది. తొలి రోజు బలమైన ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగించింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లలో ఒకటిగా నిలిచింది. కానీ, రెండవ రోజు ఈ సినిమా వసూళ్లులో గణనీయమైన తగ్గుదల కనిపించింది. Sacnilk నివేదిక ప్రకారం.. మొదటి రోజు రూ. 34.75 కోట్లు వసూలు చేయగా.. రెండవ రోజు రూ.  7.77 కోట్లకు కలెక్షన్లు పడిపోయాయి. సుమారు  70-75% వరకు కలెక్షన్లు పడిపోయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  

భారీ తగ్గుదల!

ఈ భారీ పతనం సినిమా థియేట్రికల్ రన్ పై ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ వీకెండ్ లోనైనా మళ్ళీ పుంజుకుంటుందో లేదో చూడాలి! ఇదే కొనసాగితే నిర్మాతలకు నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.  శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలకు  సుమారు 21.71%  ఆక్యుపెన్సీ  నమోదవగా.. సాయంత్రం షోలకు 27.21% నమోదైంది. ఉదయం కంటే సాయంత్రం షోలు మెరుగైన సంఖ్యలను చూపించాయి.

మొత్తం  రెండు రోజుల్లో ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది.  ప్రీమియర్స్  ద్వారానే సినిమా రూ. 11 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది.  ఇందులో తెలుగు రాష్ట్రాల్లో  రూ. 7 కోట్లు, ఓవర్సిస్ లో రూ. 4 కోట్లు రాబట్టినట్లుగా సమాచారం. 

Also Read: Nimisha Sajayan: బ్లాక్ అండ్ వైట్‌లో మెరిసిపోతున్న డీఎన్‌ఏ ముద్దుగుమ్మ.. ఒక్క స్మైల్‌తోనే కుర్రాళ్లు ఫ్లాట్!

Advertisment
తాజా కథనాలు