/rtv/media/media_files/2025/07/25/temple-2025-07-25-09-16-30.jpg)
Thailand-Cambodia Dispute
మరో రెండు ఆసియా దేశాలు గొడవ పడుతున్నాయి. నిన్నటి నుంచి థాయ్ లాండ్, కాంబోడియా దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. సరిహద్దుల్లో పలుచోట్ల పరస్పరం చేసుకున్న దాడుల్లో ఇప్పటిదాకా థాయ్‌లాండ్‌లో 11 మంది మృతి చెందారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది సాధారణ పౌరులే ఉన్నారు. 28 మంది గాయపడ్డారు. మరోవైపు కాంబోడియా వివరాలు ఇంకా తెలియలేదు. రెండు దేశాలు రాకెట్లు, ఫిరంగులతో దాడి చేసుకున్నాయి. థాయిలాండ్ F-16 యుద్ధ విమానాలతో దాడి చేసింది. కాంబోడియా, థాయ్ లాండ్ సరిహద్దులో మొత్తం ఆరుచోట్ల దాడులు జరుగుతున్నాయి.
సరిహద్దులో ఆలయం కోసం గొడవ..
థాయిలాండ్, కంబోడియా మధ్య జరుగుతున్న యుద్ధం ఒక ఆలయం దగ్గర కాల్పుల తర్వాత ప్రారంభమైంది. దీని తర్వాత కంబోడియా సైనికులు థాయ్ సైనిక స్థావరం దగ్గరకు చేరుకున్న తర్వాత, రెండు సైన్యాల సైనికుల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. కంబోడియా సైనికులు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో థాయ్ సైనిక స్థావరాలపై దాడి చేశారు. కంబోడియా సైన్యం టా ముయెన్ థామ్ ఆలయంపై దాడి చేసిందని థాయిలాండ్ ఆరోపించింది. దీని తర్వాత కంబోడియాలోని తమ రాయబారిని ఉపసంహరించుకోవడంతోపాటు ఆ దేశ రాయబారిని థాయ్‌లాండ్ బహిష్కరించింది. అన్ని సరిహద్దు గేట్లను మూసివేసింది. తమ పౌరులు కంబోడియా నుంచి వెనక్కి రావాలని ఆదేశించింది.
ఆలయం వివాదం ఏంటి?
11వ శతాబ్దంలో ఖైమర్ రాజు సూర్యవర్మన్ శివుని ఆలయాన్ని నిర్మించాడు. ఇప్పుడు ఈ ఆలయం థాయిలాండ్ ,కంబోడియా మధ్య యుద్ధానికి కారణం అయ్యింది. ఇది కంబోడియాలోని ప్రీహ్ విహార్ ప్రావిన్స్, థాయిలాండ్‌లోని సిసాకెట్ ప్రావిన్స్ సరిహద్దులో ఉంది. ఈ రెండు దేశాలు దీనిని తమవిగా చెప్పుకుంటున్నాయి. ఇదే గొడవకు కారణమయింది.
ఈ గొడవలోకి చైనా తలదూరుస్తుందా?
కాంబోడియా కన్నా థాయ్ లాండ్ అన్ని రకాల బలమైన దేశం. కాంబోడియా దగ్గర యుద్ధ విమానాలు కూడా లేవు. అదే సమయంలో థాయ్ లాండ్ దగ్గర ఫైటర్ జెట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు దేశాలతోనూ పొరుగు దేశమైన చైనాకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ డ్రాగన్ కంట్రీకి థాయ్ తో ఆర్థిక భాగస్వామ్యం కూడా ఉంది. చైనా ఇప్పటికే ఆ దేశానికి ఆయుధాలు కూడా ఇచ్చింది. భవిష్యత్తులో కూడా చైనా..థాయ్ లాండ్ కే సహాయం చేస్తుందని అంచనా. అదే కనుక అయితే కాంబోడియా మరింత బలహీనపడిపోతుంది.
Also Read: PM Modi: ఇందిరాగాంధీ రికార్డ్ ను బద్దలు కొట్టిన మోదీ..అత్యంత ఎక్కువ టైమ్ ప్రధానిగా..