Bachchala Malli : అల్లరి నరేష్ ఊరమాస్ పెర్ఫార్మెన్స్.. అంచనాలు పెంచేసిన 'బచ్చల మల్లి' గ్లింప్స్..!
అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ‘బచ్చల మల్లి’ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. టీజర్ లో అల్లరి నరేష్ రగ్డ్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఎవడి కోసం తగ్గాలి ఎందుకు తగ్గాలి' అంటూ నరేష్ చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది.