Arjun S/O Vyajayanthi Twitter Review: అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ

నందమూరి కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ మూవీలో విజయశాంతి పవర్‌ఫుల్ మదర్ రోల్ చేసింది. అయితే మూవీలో మదర్ సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ అయ్యిందని, కాకపోతే మ్యూజిక్, బీజీఎం, ఫస్టాప్ స్లోగా ఉందని ట్విట్టర్‌లో నెటిజన్లు అంటున్నారు.

New Update
Arjun S_O Vyajayanthi Twitter Review

Arjun S_O Vyajayanthi Twitter Review

నందమూరి కళ్యాణ్, విజయశాంతి నటించిన తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో విజయశాంతి కళ్యాణ్ రామ్ తల్లిగా, పోలీస్ అధికారిగా నటించింది. అయితే చాలా ఏళ్ల తర్వాత విజయశాంతి పోలీస్ అధికారిగా నటించింది. సయీ మంజ్రేకర్ ఈ మూవీలో హీరోయిన్‌గా అలరించింది. అయితే నేడు ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ట్వి్ట్టర్ రివ్యూలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: AP: వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్

ఇది కూడా చూడండి: Florida university: ఫ్లోరిడా వర్సిటీలో మరోసారి పేలిన తుపాకీ.. ఇద్దరు మృతి..!

మదర్ సెంటిమెంట్ బాగా సెట్ అయ్యిందని..

అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ విజయశాంతి పోలీస్ అధికారిగా కనిపించడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. మొదటి నుంచి ప్రతీ సన్నివేశం కూడా బాగుంది. ముఖ్యంగా విజయశాంతి, నందమూరి కళ్యాణ్ రామ్ మధ్య సెంటిమెంట్ సీన్స్ అయితే అదిరిపోయాయి. సినిమా మొత్తానికి మదర్ సెంటిమెంట్ హైలైట్ అని నెటిజన్లు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Cinema: నిన్న డ్రగ్స్...ఇవాళ లైంగిక ఆరోపణలు..మలయాళ నటుడు టామ్ చాకో నిర్వాకం

మూవీ ఫస్టాఫ్‌లో కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కానీ ఆ తర్వాత కాస్త రొటీన్‌గా ఉంటుందట. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లో మూవీ ఉన్నట్లు కనిపిస్తు్ంది. సినిమాలో బీజీఎమ్, పాటలు ఏ మాత్రం అలరించలేదు. ముఖ్యమైన సన్నివేశాల్లో బీజీఎమ్ ఫ్లామ్ అని చెప్పవచ్చు. అయితే సెకండాఫ్‌లో కొన్ని ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని చెబుతున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్ బాగున్నాయి. కాకపోతే స్టోరీ రొటీన్‌‌గా ఉండటం, సాగదీత వల్ల అక్కడక్కడ బోరింగ్‌గా అనిపిస్తుందని అంటున్నారు. 

ఇది కూడా చూడండి: FlipKart: వారంలో ఐదు రోజులు ఆఫీసుకు రావాల్సిందే...ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ సంచలన నిర్ణయం!

 

kalyan-ram | vijayshanthi | Arjun Son Of Vyjayanthi Teaser | twitter-review | Tollywood news updates | tollywood-news-in-telugu | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు