Kesari 2: ‘కేసరి 2’: రక్తం ఉప్పొంగించే గాథ.. అక్షయ్ కుమార్ పవర్ఫుల్ పోలిటికల్ డ్రామా..

అక్షయ్ కుమార్ నటించిన ‘కేసరి 2’ జలియన్‌వాలా బాగ్‌ ఘటన ఆధారంగా రూపొందిన దేశభక్తి చిత్రం. ‘తాజాగా రిలీజైన ‘ఓ షేరా’’ పాటకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది.

New Update
Kesari 2

Kesari 2

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) మరోసారి ఓ గంభీరమైన చారిత్రక పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కేసరి 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్‌’, దేశభక్తిని ప్రతిబింబించేలా రూపొందుతోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు కరణ్ సింగ్ త్యాగి, నిర్మాతగా కరణ్ జోహార్ వ్యవహరిస్తున్నారు.

Also Read: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని

‘‘ఓ షేరా.. తీర్ తే తాజ్’’

తాజాగా విడుదలైన ఫస్ట్ సాంగ్ ‘‘ఓ షేరా.. తీర్ తే తాజ్’’లో  దేశభక్తి భావోద్వేగాలను చాలా బలంగా చూపించారు. “ధైర్యాన్ని అనుభూతి చెందే సమయమిది” అనే ట్యాగ్‌లైన్‌తో పాటు, "సింహంలా లేచి మళ్లీ నీ శక్తిని చూపించు" అనే పాట లైన్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ గీతానికి సంగ్తార్ సంగీతం అందించగా, సుఖ్వీందర్ అమృత్ రచించారు, ప్రముఖ గాయకుడు మన్మోహన్ వారిస్ ఆలపించారు.

Also Read: ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-2’: రాఖీ భాయ్ విధ్వంసానికి మూడేళ్లు!

ఈ సినిమా 1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్‌ ఊచకోత నేపథ్యంలో రూపొందుతోంది. ఈ కథను ఒక కొత్త కోణంలో చూపించేందుకు చిత్రబృందం ఎంతో శ్రమ పడినట్టు తెలుస్తోంది. అక్షయ్‌తో పాటు అనన్య పాండే, ఆర్. మాధవన్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..

ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ప్రోమోస్, పాటలు సినిమా పట్ల ఆసక్తిని మరింతగా పెంచుతున్నాయి. ఈ నెల 18న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రం, చారిత్రక సంఘటనను ఆధారంగా తీసుకుని, ఒక భావోద్వేగ భరితమైన ప్రయాణంగా ప్రేక్షకుల మనసులను తాకనుంది.

Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

 

bollywood-actor | telugu-film-news | telugu-cinema-news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | 2025 Tollywood movies | latest tollywood updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు