Hit 3: నరరూప రాక్షసుడిని చూస్తారు.. మే 1న థియేటర్లలో కలుద్దాం: నాని
నాని హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'హిట్ 3' ట్రైలర్ విడుదలైంది. విశాఖపట్నంలో జరిగిన ఈవెంట్‌లో నాని అభిమానులతో మాట్లాడి, సినిమా గురించి అంచనాలు పెంచాడు. ‘హిట్ 3’ మే 1న విడుదలవ్వనుంది. ఈ సారి మరింత ఇంటెన్స్, వైల్డ్‌గా ఉండనుంది హిట్ 3.
Hit 3: టాలెంటెడ్ యాక్టర్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. విశాఖపట్నంలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి నాని హాజరై అభిమానులతో మమేకమయ్యారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, “వైజాగ్ నాకు ప్రత్యేకమైన స్థలం. ఇక్కడివారు నన్ను అల్లుడిలా చూస్తారు. 15 ఏళ్ల క్రితం ప్రేమ కోసం ఈ నగరానికి వచ్చాను, ఇప్పుడు మీ ప్రేమ కోసమే మళ్లీ వచ్చాను,” అని భావోద్వేగంతో చెప్పారు. “మీ ఎనర్జీ చూస్తుంటే, సాయంత్రం వరకూ ఇక్కడే ఉండాలని ఉంది,” అని అభిమానులపై తన ప్రేమను వ్యక్తపరిచారు.
‘హిట్ 3’ చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ‘హిట్ యూనివర్స్’లో మూడో భాగం. గత సినిమాల కంటే ఈసారి కథ మరింత వైల్డ్, ఇంటెన్స్‌గా ఉంటుందని ట్రైలర్ చూస్తే స్పష్టంగా తెలుస్తోంది.
నాని మాట్లాడుతూ, “ఈ సినిమా ఓ కొత్త జానర్ అనుభూతిని ఇస్తుంది. మే 1న థియేటర్లలో కలుద్దాం. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవాళ్లు మాత్రం మిస్ అవ్వకండి. ఫీల్‌గుడ్, ఫన్ మూవీ ఫ్యాన్స్ మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి,” అంటూ సరదాగా తెలిపారు.
ఈ సినిమాలో నానికి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. హిట్ సిరీస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హిట్ 3’ మే 1న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసారి నాని ఎలా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మోడ్‌లో కనిపించనున్నాడో చూడాల్సిందే!

Hit 3

Also Read: ‘కేజీఎఫ్ చాప్టర్-2’: రాఖీ భాయ్ విధ్వంసానికి మూడేళ్లు!
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, “వైజాగ్ నాకు ప్రత్యేకమైన స్థలం. ఇక్కడివారు నన్ను అల్లుడిలా చూస్తారు. 15 ఏళ్ల క్రితం ప్రేమ కోసం ఈ నగరానికి వచ్చాను, ఇప్పుడు మీ ప్రేమ కోసమే మళ్లీ వచ్చాను,” అని భావోద్వేగంతో చెప్పారు. “మీ ఎనర్జీ చూస్తుంటే, సాయంత్రం వరకూ ఇక్కడే ఉండాలని ఉంది,” అని అభిమానులపై తన ప్రేమను వ్యక్తపరిచారు.
Also Read: బాలయ్య ఫ్యాన్స్ చొక్కాలు చింపుకునే న్యూస్..
ఈసారి మరింత వైల్డ్ గా
‘హిట్ 3’ చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ‘హిట్ యూనివర్స్’లో మూడో భాగం. గత సినిమాల కంటే ఈసారి కథ మరింత వైల్డ్, ఇంటెన్స్‌గా ఉంటుందని ట్రైలర్ చూస్తే స్పష్టంగా తెలుస్తోంది.
Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..
నాని మాట్లాడుతూ, “ఈ సినిమా ఓ కొత్త జానర్ అనుభూతిని ఇస్తుంది. మే 1న థియేటర్లలో కలుద్దాం. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవాళ్లు మాత్రం మిస్ అవ్వకండి. ఫీల్‌గుడ్, ఫన్ మూవీ ఫ్యాన్స్ మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి,” అంటూ సరదాగా తెలిపారు.
Also Read: పెళ్లిపై తమన్నా షాకింగ్ కామెంట్స్..