/rtv/media/media_files/2025/04/15/C8b7loFDC0QoNDxOw7vs.jpg)
Balayya
Balayya: నందమూరి బాలకృష్ణ మళ్లీ మాస్ మోడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 'డాకు మహారాజ్'తో భారీ విజయాన్ని అందుకున్న తర్వాత, తాజాగా మరో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈసారి బాలయ్యకు సూపర్ హిట్ అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో మళ్లీ చేతులు కలిపారు.
Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..
'వీర సింహారెడ్డి’ కాంబినేషన్ మరోసారి
‘వీర సింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన ఈ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ చర్చలు పూర్తి కాగా, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. మాస్ సినిమాల స్పెషలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని ఇటీవల బాలీవుడ్‌లో ‘జాట్’ సినిమాతో కూడా మంచి గుర్తింపు పొందారు.
Also Read: పెళ్లిపై తమన్నా షాకింగ్ కామెంట్స్..
ఈ ప్రాజెక్ట్‌ను వృద్ధి సంస్థ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మించనున్నారు. ఈ సంస్థ ఇప్పటికే రామ్ చరణ్ తో సినిమా నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్..! సీక్రెట్ బయటపెట్టిన కళ్యాణ్ రామ్ ..
ఇక మరోవైపు, బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘అఖండ 2: తాండవం’ కూడా దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇందులో బాలయ్య అఘోర పాత్రలో డబుల్ రోల్‌లో కనిపించనున్నారు. ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా, హిందీతో సహా పలు భాషల్లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి త్వరలో ఫస్ట్ గ్లింప్స్ రానుండటంతో, బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Also Read: వాళ్లను అస్సలు పట్టించుకోను.. ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చిపడేసిన మౌనీ రాయ్