Rajamouli: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..

దర్శకుడు రాజమౌళి జపాన్‌లో అభిమానులతో సమావేశమై, తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడు తెలుగు సినిమాలు రామ్ చరణ్‌ “పెద్ది”, ఎన్టీఆర్‌ “డ్రాగన్”, ప్రభాస్‌ “స్పిరిట్” చిత్రాలుగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులపై తన ఆసక్తిని వ్యక్తం చేశారు.

New Update
Rajamouli

Rajamouli

Rajamouli: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటగా తెరకెక్కుతున్న తన తాజా చిత్రం SSMB 29కి స్వల్ప విరామం తీసుకుని జపాన్‌లో అభిమానులతో సమావేశమయ్యారు. టోకియోలో జరుగుతున్న ఈ ప్రత్యేక ఈవెంట్‌ RRR సినిమా మేకింగ్‌పై రూపొందిన డాక్యుమెంటరీ ప్రమోషన్‌లో భాగంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ తనకు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాబోయే తెలుగు సినిమాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Also Read: పెళ్లిపై తమన్నా షాకింగ్ కామెంట్స్..

తాను ఎదురుచూస్తున్న సినిమాల్లో మూడు స్పెషల్ ప్రాజెక్టులు ఉన్నాయని రాజమౌళి తెలిపారు. అవి రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న "పెద్ది", ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న "డ్రాగన్", అలాగే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపొందనున్న "స్పిరిట్" సినిమాలు అని చెప్పారు.

Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్..! సీక్రెట్ బయటపెట్టిన కళ్యాణ్ రామ్ ..

ప్రతి సినిమాపై రాజమౌళి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, ఇటీవల విడుదలైన "పెద్ది" టీజర్‌ను చూసి ఎంతో ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. రామ్ చరణ్‌ను చాలా రా, ఇంటెన్స్ మాస్ అవతారంలో బుచ్చిబాబు చూపించారని కొనియాడారు.

తనకు ఎన్టీఆర్‌తో ఉన్న బంధాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తున్న "డ్రాగన్" ఓ భారీ విజువల్ ఫీస్ట్‌గా ఉండబోతుందని పేర్కొన్నారు.

Also Read: వాళ్లను అస్సలు పట్టించుకోను.. ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చిపడేసిన మౌనీ రాయ్

ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా..

అలాగే, సందీప్ రెడ్డి వంగా సినిమాల పట్ల తనకున్న అభిమానాన్ని తెలియజేస్తూ, "స్పిరిట్"(Spirit) సినిమా గురించి తాను అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌గా పేర్కొన్నారు.

ఈ మూడు సినిమాల్లో నటిస్తున్న రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఈ  ముగ్గురు హీరోలతో రాజమౌళి గతంలో ఇండస్ట్రీ హిట్లు కొట్టి రికార్డులు  సృష్టించిన చిత్రాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే. అందుకే ఈ ప్రాజెక్టులపై ఆయనకు ఉన్న ఆసక్తి ప్రత్యేకమని చెప్పొచ్చు.

Also Read: అజిత్ ఎనర్జీ చూసి షాకయ్యా: సునీల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు