Business: భారీ నష్టాలతో దేశీ స్టాక్ మార్కెట్లు బ్లడ్ బాత్
దేశీ మార్కెట్ భారీ నష్టాల పరంపర కొనసాగుతుంది. అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలతో పరిస్థితి మరింత దిగజారుతోంది. సెన్సెక్స్ 900 పడిపోయి మార్కెట్లకు ఫ్రై డేను చూపిస్తోంది.
దేశీ మార్కెట్ భారీ నష్టాల పరంపర కొనసాగుతుంది. అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలతో పరిస్థితి మరింత దిగజారుతోంది. సెన్సెక్స్ 900 పడిపోయి మార్కెట్లకు ఫ్రై డేను చూపిస్తోంది.
ఏపీ బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల అంసెబ్లీలో ప్రవేశపెట్టారు. 3లక్షల 22వేల 359 కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ కేటాయించారు. అమరావతి నిర్మాణానికి 6వేల కోట్లు, వ్యవసాయానికి 48 వేల కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.31, 806కోట్లు కేటాయించారు.
గోవా టూరిజం పతనం కావడానికి ఇడ్లీ, సాంబార్ కారణమని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో అన్నారు. వీటితోపాటు బీచ్‌లో వడా పావ్‌లు విక్రయించడం వల్లే విదేశీ పర్యటకుల సంఖ్య తగ్గిందని మండిపడ్డారు. ఇతర ప్రాంతాల వారికి గోవా వాసులు దుకాణాలు అద్దెకు ఇవొద్దన్నారు.
టెక్ బ్రాండ్ రియల్మీ ఇటీవల Realme P3x 5G ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఇవాళ ఈ ఫోన్ సేల్ స్టార్ట్ కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, రియల్మీ అధికారిక వెబ్సైట్, రిటైలర్ల స్టోర్లలో సేల్ జరగనుంది. దీనిపై రూ. 1,000 తగ్గింపును పొందొచ్చు.
రెండు ఏఐ (AI) చాట్‌బాట్స్ ఒక హోటల్ బుకింగ్ కోసం మాట్లాడుకున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మానవులకు అర్థం కాని విధంగా విచిత్ర శబ్దాలు చేస్తూ 'బీప్-బోప్' అన్నట్లుగా మాట్లాడుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇండియాలో ఉన్న క్విక్ కామర్స్ ల్లో బ్లింకిట్ ఇప్పుడు దూసుకుపోతోంది. మామూలు గ్రోసరీతో యాపిల్ లాంటి ఉత్పత్తులు కూడా డెలివరీ చేస్తోంది. కేవలం పది నిమిషాల్లో అందిస్తామని కంపెనీ చెబుతోంది.
ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్ మీ తన లైనప్‌లో ఉన్న Neo 7x స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. దీంతోపాటు Realme Neo 7 SEని కూడా పరిచయం చేసింది. ఇది రెండు వేరియంట్లలో వచ్చింది. Realme చైనా ఇ-స్టోర్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దేశంలో కొనుక్కోవచ్చు.
భూమిఅంతం గురించి న్యూటన్ చెప్పిన విషయం గురించి ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. 2060 లో భూమి అంతమైతుందని భౌతిక, ఖగోళ శాస్త్రవేత్త చెప్పాడు. బైబిల్లో ఉన్న సంకేతాలు, సంఖ్యల లెక్కల ఆధారంగా న్యూటన్ ఈ విషయాన్ని చెప్పాడు. దీనిపై అనేక భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
గాల్లో ఎగిరే కార్లని తయారు చేసింది కాలిఫోర్నియాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ సంస్థ. ఇది పూర్తి ఎలక్ట్రిక్ వాహనం, ఈ కార్ ధర సుమారు రూ.2.5 కోట్లు ఉండే అవకాశం ఉంది. 2025 చివర్లో దీన్ని మార్కెట్లో విడుదల చేయాలని సంస్థ ప్లాన్ చేస్తోంది.