Tv Offers: రూ.3,099లకే స్మార్ట్‌ టీవీ గురూ.. అమెజాన్‌‌లో అరాచకమైన ఆఫర్..!

అమెజాన్‌లో రూ.10,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. VW, కోడాక్ వంటి బ్రాండ్ల 32-అంగుళాల టీవీలు తక్కువ ధరలో మంచి ఫీచర్లు అందిస్తున్నాయి. VW 32-అంగుళాల టీవీ రూ.3,099, Kodak 32-అంగుళాల టీవీ రూ.4,449లకే సొంతం చేసుకోవచ్చు. 

New Update
AMAZON SMART TV OFFERS 2025

AMAZON SMART TV OFFERS 2025

ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్‌(Amazon) లో త్వరలో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్(amazon-great-indian-festival-sale) ప్రారంభం కానుంది. ఇది సెప్టెంబర్ 23 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో అమెజాన్‌ స్మార్ట్‌ టీవీలపై బంపర్ డిస్కౌంట్లు ప్రకటించింది. కేవలం రూ. 10,000 లోపు ధరలోనే స్మార్ట్ టీవీలు లిస్ట్ కాగా.. పలు డిస్కౌంట్‌లతో మరింత తక్కువకే సొంతం చేసుకోవచ్చు. 

ప్రస్తుతం మార్కెట్‌లో చాలా బ్రాండ్స్ ఈ ధరలో మంచి ఫీచర్లతో స్మార్ట్ టీవీ(smart-tv-offer) లను అందిస్తున్నాయి. బడ్జెట్ ధరలో కొత్త టీవీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇవి మంచి ఆప్షన్ అనే చెప్పాలి. ఈ టీవీలు సాధారణంగా 32-అంగుళాల సైజుతో లభిస్తాయి. ఇప్పుడు తక్కువ ధరలో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ టీవీల గురించి తెలుసుకుందాం. 

Also Read :  Iphone 17లో బయపపడ్డ సాంకేతిక లోపం.. ఒప్పుకున్న యాపిల్.. ఏంటో తెలుసా?

VW 32 Inches Frameless Series HD Ready Android Smart LED TV

VW 32-అంగుళాల HD రెడీ స్మార్ట్ LED టీవీ అమెజాన్‌లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. దీని అసలు ధర రూ.16,999 ఉండగా.. ఇప్పుడు కేవలం 58 శాతం భారీ తగ్గింపుతో కేవలం రూ.7,199లకే సొంతం చేసుకోవచ్చు. అంటే లాంచ్ ధర కంటే సగం ధరకే ఇప్పుడు లభిస్తుంది. దీంతో పాటు SBI క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్‌పై రూ.1500 వరకు భారీ బ్యాంక్ ఆఫర్ పొందొచ్చు. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. అలాగే క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఇవి కాకుండా దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందించారు. దాదాపు రూ.2,600 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో బ్యాంక్, ఎక్స్ఛేంజ్ తగ్గింపుతో ఈ టీవీని కేవలం రూ.3,099లకే సొంతం చేసుకోవచ్చు. 

Dyanora 24 Inches HD Ready Non Smart LED TV 

Dyanora 24 Inches HD Ready Non Smart LED TV పై కూడా అమెజాన్‌(amazon-offers) లో భారీ తగ్గింపు లభిస్తుంది. దీని అసలు ధర రూ.10,999 ఉండగా.. ఇప్పుడు 45 శాతం భారీ తగ్గింపుతో కేవలం రూ.5,999లకే సొంతం చేసుకోవచ్చు. దీనిపై కూడా నో కాస్ట్ ఈఎంఐ, క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. అలాగే రూ.2,600 వరకు భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్‌తో దీనిని కేవలం రూ.3,399లకే సొంతం చేసుకోవచ్చు. 

Also Read :  వెంటనే US వచ్చేయండి.. H1-B, H4 వీసా ఉన్న ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ పిలుపు!

Kodak 32 inches Special Edition Series HD Ready Smart LED TV

Kodak 32 inches Special Edition Series HD Ready Smart LED TVపై అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్ ఉంది. దీని అసలు ధర రూ.14,999 ఉండగా ఇప్పుడు 47 శాతం తగ్గింపుతో కేవలం రూ.7,999 లకే సొంతం చేసుకోవచ్చు. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ, క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది. అలాగే రూ.3,550 వరకు భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది. ఈ తగ్గింపుతో ఈ టీవీని కేవలం రూ.4,449లకే సొంతం చేసుకోవచ్చు. 

Advertisment
తాజా కథనాలు