/rtv/media/media_files/2025/09/19/iphone-17-series-offers-2025-09-19-19-09-28.jpg)
IPhone 17 Series Offers
ఆపిల్ తన iphone 17 seriesను ఈ నెల సెప్టెంబర్ 9న లాంచ్ చేసింది. ఇవాళ అంటే సెప్టెంబర్ 19న ఈ సిరీస్ సేల్‌కు అందుబాటులోకి వచ్చింది. ఇందులో iphone 17, iphone 17 Pro, iphone 17 Pro Max, iphone Air మోడల్స్ ఉన్నాయి. లాంచ్‌లో భాగంగా కంపెనీ ఈ iphone offersలపై బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ EMI ఎంపికలను అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. వీటివల్ల కస్టమర్లు అదనపు డబ్బును ఆదా చేసుకోవచ్చు. అందువల్ల మీరు కొత్త iphone కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే సరైన అవకాశం. ఇప్పుడు iphone 17 సిరీస్ ధర, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Also Read : కెవ్వు కేక.. రూ.1899లకే గీజర్.. అబ్బబ్బ చలి పుట్టకముందే కొనేయండి బాసూ..
iphone 17 Series Price
iphone17 - 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 82,900,
iphone17 - 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,02,900.
iphone Air - 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,19,900.
iphone Air - 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,39,900.
iphone Air - 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,59,900.
iphone 17 Pro - 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,34,900. iphone 17 Pro - 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,54,900. iphone 17 Pro - 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,74,900.
iphone 17 Pro Max - 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,49,900.
iphone 17 Pro Max - 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,69,900.
iphone 17 Pro Max - 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,89,900.
iphone 17 Pro Max - 2TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.2,29,900.
ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఇవాళ ఆపిల్ స్టోర్లు, ఆపిల్ అధికారిక వెబ్‌సైట్, ఈ-కామర్స్ సైట్లు అమెజాన్(amazon-offers), ఫ్లిప్‌కార్ట్(flipkart offers 2025), విజయ్ సేల్స్(Vijay Sales) వంటి ఇతర రిటైల్ ప్లాట్‌ఫామ్‌లలో సేల్‌కు అందుబాటులో ఉన్నాయి.
Also Read : వాట్సాప్‌లోనే నానో బనాన.. ఫొటోలు ఇలా చేసుకోవచ్చు.. రచ్చ రచ్చే!
IPhone 17 Series Offers
లాంచ్ ఆఫర్లలో ఐఫోన్ 17 సిరీస్ కోసం అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ కార్డ్ ట్రాన్సక్షన్లపై రూ.5,000 వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే ఆరు నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు పాత లేదా ఇప్పటికే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.64,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను పొందవచ్చు.