BREAKING: వెంటనే US వచ్చేయండి.. H1-B, H4 వీసా ఉన్న ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ పిలుపు!

అమెరికా ప్రభుత్వం H1B వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది.  తమ ఉద్యోగుల్లో H1B, H4 వీసాదారులను రేపటిలోగా అమెరికా చేరుకోవాలని ఆదేశించింది. 

New Update
BREAKING NEWS

BREAKING NEWS

అమెరికా ప్రభుత్వం H1B వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచిన నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ విదేశీ ఎంప్లాయిస్‌లో H1B, H4 వీసాదారులను రేపటిలోగా అమెరికా చేరుకోవాలని ఆదేశించింది. హెచ్1బీ, హెచ్4 వీసా ఉద్యోగులను వెంటనే అమెరికాకు తిరిగి రావాలని కోరుతూ ఇంటర్నల్ మెమో జారీ చేసింది. ఈ నిర్ణయం టెక్ కంపెనీ విదేశీ ఉద్యోగులలో తీవ్ర ఆందోళన కలిగించింది.

మైక్రోసాఫ్ట్ విదేశీ ఉద్యోగులకు సెప్టెంబర్ 21 లోగా అమెరికాకు తిరిగి రావాలని కోరింది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత తిరిగి అమెరికా రావడం కష్టతరం కావచ్చు అనే భయంతో ఈ సూచనలు జారీ చేసినట్లు సమాచారం. అమెరికాలో ఉన్న వీసాదారులను కూడా "ఇప్పటికి ఇక్కడే ఉండండి" అని కంపెనీ కోరినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ అనిశ్చితి ఇతర టెక్ కంపెనీలైన గూగుల్, అమెజాన్ వంటి వాటిని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయాలు అమెరికన్ టెక్నాలజీ రంగంలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించాయి.

Advertisment
తాజా కథనాలు