/rtv/media/media_files/2025/09/20/redmi-15c-5g-2025-09-20-18-24-47.jpg)
Redmi 15C 5G
Xiaomi తన కొత్త స్మార్ట్‌ఫోన్ Redmi 15C 5Gని ప్రపంచ మార్కెట్లలో విడుదల చేసింది. కంపెనీ ఈ ఫోన్‌ను బడ్జెట్ విభాగంలో విడుదల చేసింది. ఇందులో 120Hz డిస్ప్లే, 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్ పోలాండ్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ Android 15-ఆధారిత HyperOS 2పై నడుస్తుంది. కాగా కంపెనీ ఇటీవల తన Redmi 15R 5Gని చైనాలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
Redmi 15C 5G Price
Redmi 15C 5G పోలాండ్‌లో సుమారు రూ. 19,500 ధర వద్ద లాంచ్ అయింది. దీని బేస్ మోడల్ 4GB RAM + 256GB స్టోరేజ్‌తో లభిస్తుంది. అయితే ప్రస్తుతం ఇది లాంచ్ ఆఫర్‌లో భాగంగా కేవలం రూ. 17,000లకే అందుబాటులో ఉంది. ఇది పరిమిత కాల ఆఫర్‌గా అని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ డస్క్ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. Redmi 15C 5G అధికారిక వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది .
Redmi 15C 5G Launched with 50-Megapixel Rear Camera, 6,000mAh Battery.#Xiaomi#Redmi#Redmi15C5G#newlaunch#mobilesdetailpic.twitter.com/aN9c4nAH47
— MobilesDetail (@mobilesdetail) September 20, 2025
Redmi 15C 5G మొబైల్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత HyperOS 2 పై నడుస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. 6.9-అంగుళాల డాట్ డ్రాప్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1600×720 పిక్సెల్ రిజల్యూషన్, 660 నిట్స్ బ్రైట్‌నెస్, HBM మోడ్‌లో 810 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. పనితీరు పరంగా చూసుకుంటే.. ఈ Redmi 15C 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 6nm ప్రాసెస్ ఆధారంగా పనిచేస్తుంది. అంతేకాకుండా 4GB RAM + 256GB వరకు స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు.
కెమెరా విషయానికొస్తే.. Redmi 15C 5Gలో 50MP ప్రైమరీ AI కెమెరా, సెకండరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ Redmi 15C 5G మొబైల్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. Redmi 15C 5Gలో IP64-రేటెడ్ బిల్డ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు.