/rtv/media/media_files/2025/09/20/oppo-festive-sale-1-2025-09-20-20-54-17.jpg)
Oppo Festive Sale (1)
మరికొద్ది రోజుల్లో దసరా, దీపావళి పండుగల ఉత్సవాలు రాబోతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో అదిరిపోయే సేల్(Oppo Festive Sale) ను ప్రకటించింది. పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఒప్పో భారతదేశంలో oppo festive sale 2025 తీసుకొచ్చింది. ఈ సేల్ సెప్టెంబర్ 19న ప్రారంభమైంది. అక్టోబర్ 31 వరకు కొనసాగుతుంది. వినియోగదారులు రిటైల్ షాప్‌లు, ఒప్పో అధికారిక వెబ్‌సైట్, ఈ-కామర్స్ సైట్‌లు ఫ్లిప్‌కార్ట్(flipkart-big-billion-days-sale), అమెజాన్‌లలో ఈ సేల్‌ను పొందవచ్చు.
ఈ సేల్‌లో ఇటీవల లాంచ్ చేసిన Oppo F31 series, Oppo Reno 14 series, టాబ్లెట్‌లపై కంపెనీ డిస్కౌంట్లను అందిస్తోంది. oppo festive sale సందర్భంగా.. జీరో డౌన్ పేమెంట్, నో-కాస్ట్ EMI, ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ తగ్గింపులు వంటి అనేక స్పెషల్ ఆఫర్‌లు అందిస్తోంది. దీంతో పాటు My OPPO Exclusive Diwali Raffle ద్వారా రూ.10 లక్షలు లేదా రూ.1 లక్ష నగదు బహుమతులతో పాటు Oppo ప్రొడెక్టును గెలుచుకునే అవకాశం కూడా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇప్పుడు దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
OPPO India brings Grand Festive Sale across its portfolio 🔥
— Atul Tech ₿azaar 🇮🇳 (@Atulbazaar) September 19, 2025
₹10 Lakh Mega Prize for 10 lucky customers @OPPOIndiahttps://t.co/Z8VPFkKCjtpic.twitter.com/RkRDGBRzXh
Also Read : New Smartphone: AI కెమెరా, 6,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్ సూపరెహే.. ఫీచర్లు తెలిస్తే ఫ్యూజులు ఔటే..!
ఒప్పో F31 సిరీస్, రెనో 14 సిరీస్‌లపై ఆఫర్లు
కస్టమర్లు 8 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్ పొందుతారు. అలాగే వడ్డీ లేని EMIలు, 10% ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి ప్రయోజనాలను అమెజాన్ అందిస్తోంది. ఈ సేల్‌లో Oppo F31 సిరీస్ రూ.20,700 నుండి అందుబాటులో ఉంటుంది. అలాగే Reno14 సిరీస్ రూ.34,999 కు లభిస్తుంది. Oppo A సిరీస్‌ను రూ.8,999 నుండి పొందొచ్చు. అన్ని Oppo స్మార్ట్‌ఫోన్‌లు తక్కువ డౌన్ పేమెంట్‌లు, తక్కువ EMIలు, 10% తక్షణ క్యాష్‌బ్యాక్‌తో లభిస్తాయి. అంతేకాకుండా Oppo ప్రొడెక్టును కొనుక్కునేటప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బజాజ్ ఫిన్‌సర్వ్, TVS క్రెడిట్, HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ ద్వారా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.
OPPO ఎక్స్‌క్లూజివ్ దీపావళి రాఫెల్
ఒప్పో మొబైల్ ఫోన్‌లను కొనుగోలు చేసే కస్టమర్‌లకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. పది మంది మెగా-విజేతలకు రూ.10 లక్షల నగదు బహుమతి, ఒక రోజువారీ విజేతకు రూ.1 లక్ష నగదు బహుమతి లభిస్తాయి. అదనంగా ఒప్పో ఫైండ్ X8, రెనో14, ఒప్పో F31 ప్రో, ఒప్పో ఎన్‌కో బడ్స్ 3 ప్రో ఉచితంగా లభిస్తాయి. 5,000 రివార్డ్ పాయింట్లతో పాటు 3 నెలల పొడిగించిన వారంటీ అందుబాటులో ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 స్పెషల్ ఆఫర్స్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 లో భాగంగా.. Oppo K సిరీస్, Oppo Enco Buds 3 Pro, Oppo Pad SE లపై ప్రత్యేక ఆఫర్‌లను పొందవచ్చు. ఈ సేల్ సెప్టెంబర్ 23 నుండి ప్రారంభం కానుంది. Oppo K13 సిరీస్ సేల్ సమయంలో రూ.9,999 నుండి ప్రారంభమవుతుంది. Oppo Pad SE ధర రూ.9,900, Oppo Enco Buds 3 Pro పండుగ సీజన్‌లో రూ.1,499 కు అందుబాటులో ఉంటుంది.
Also Read : రచ్చ రచ్చే.. ఐఫోన్ 17 సిరీస్ బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు తెలిస్తే పిచ్చెక్కిపోతారు..!