iPhone Discounts: రూ.37 వేల భారీ డిస్కౌంట్‌తో ఐఫోన్.. పిచ్చేక్కించే ఆఫర్లు.. వెంటనే త్వరపడండి!

ఐఫోన్ 17 వచ్చిన తర్వాత ఐఫోన్ 15, 14 సిరీస్‌ల ధరలు భారీగా తగ్గాయి. ఐఫోన్ 14 దేశంలోకి రూ.79,900 ధరతో వచ్చింది. అయితే ఇప్పుడు ఆ  ఐఫోన్ 14ను రూ.37 వేల భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. అన్ని తగ్గింపులతో రూ. 40,099కే మీరు ఐఫోన్ 14 సిరీస్ పొందవచ్చు.

New Update
Iphone offers

Iphone offers

ఆపిల్ కంపెనీ ఇటీవల ఐఫోన్ 17 సిరీస్‌ను రిలీజ్ చేసింది. కొత్త సిరీస్ మొబైల్ వచ్చినప్పుడు ముందు సిరీస్‌ల ఫోన్ల ధరలు తగ్గుతాయి. అయితే తక్కువ బడ్జెట్ ఉన్నవారు ట్రెండింగ్‌లో ఉన్న సిరీస్ కాకుండా అంతకుముందు సిరీస్‌లు తీసుకుంటారు. ఐఫోన్ 17 వచ్చిన తర్వాత ఐఫోన్ 15, 14 సిరీస్‌ల ధరలు భారీగా తగ్గాయి. ఐఫోన్ 14 దేశంలోకి రూ.79,900 ధరతో వచ్చింది. అయితే ఇప్పుడు ఆ  ఐఫోన్ 14ను రూ.37 వేల భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న ఆఫర్ వల్ల ఈ ఫోన్ ధర ఇప్పుడు రూ. 42,999 కి పడిపోయింది. వీటికి మీరు యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే అదనంగా రూ.1,500 తగ్గింపు కూడా లభిస్తుంది. దీంతో పాటు మీ పాత ఫోన్‌ ఉంటే మార్చితే అదనపు బోనస్ కూడా వస్తుంది. ఈ ఆఫర్లు అన్ని కలిపి మీరు తీసుకుంటే.. రూ. 40,099 కే మీరు ఐఫోన్ 14 సిరీస్ పొందవచ్చు.  

ఇది కూడా చూడండి: New Smartphone: AI కెమెరా, 6,000mAh బ్యాటరీతో కొత్త ఫోన్ సూపరెహే.. ఫీచర్లు తెలిస్తే ఫ్యూజులు ఔటే..!

అదిరిపోయే ఫీచర్లు..

ఐఫోన్ 14 సిరీస్ ఫీచర్లు కూడా బాగుంటాయి. ఇది A15 బయోనిక్ చిప్‌తో పనిచేస్తుంది. ఇందులో 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్‌ప్లే ఉంది. దీని రిజల్యూషన్ 2532 x 1170 పిక్సెల్స్. ఈ డిస్‌ప్లే హెచ్‌డీఆర్ సపోర్ట్‌తో పాటు, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ ఉంటుంది. ఈ ఐఫోన్ సిరీస్ ఐఓఎస్ 16 (iOS 16) ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. దీనికి కొత్త ఐఓఎస్ అప్‌డేట్స్ కూడా అందుతాయి.కెమెరా విషయానికి వస్తే, ఐఫోన్ 14 వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో రెండు కెమెరాలు 12 మెగాపిక్సెల్స్ సామర్థ్యం ఉంది. ముందు భాగంలో కూడా 12 మెగాపిక్సెల్స్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 30FPS వద్ద 4K డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్‌ ఉంది. యాపిల్ సూపర్ కెమెరా ఫీచర్ల వల్ల ఈ ఫోన్‌లో అద్భుతమైన ఫోటోలు, వీడియోలు వస్తాయి. ఐఫోన్ 14 బ్యాటరీ చాలా బాగా పనిచేస్తుంది. ఇది దాదాపు 20 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్ అందిస్తుంది. ఈ ఫోన్ యూఎస్‌బీ టైప్-సి లైటెనింగ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. తక్కువ బడ్జెట్‌లో ఐఫోన్ కావాలని అనుకునేవారు వెంటనే కొనుగోలు చేసేయండి.

ఇది కూడా చూడండి: Oppo Festive Sale: ఒప్పో బంపర్ సేల్.. రూ.10లక్షల బహుమతి, ఫ్రీ మొబైల్స్ పొందే అద్భుత అవకాశం..!

Advertisment
తాజా కథనాలు