New Smartphone: శాంసంగ్ కుమ్మేసింది బాబోయ్.. కిర్రాక్ ఫోన్ లాంచ్ - AI ఫీచర్లు అదిరిపోయాయ్..!

శాంసంగ్ గెలాక్సీ A17 4G స్మార్ట్‌ఫోన్ 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో జర్మనీలో విడుదలయ్యింది. ఇది 6.7-అంగుళాల Super AMOLED డిస్ప్లే, MediaTek Helio G99 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 తో వస్తుంది. దీని ధర సుమారు రూ.15,000 నుండి ప్రారంభమవుతుంది.

New Update
Samsung Galaxy A17 4G (1)

Samsung Galaxy A17 4G (1)

శామ్సంగ్ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy A17 4Gని జర్మనీలో విడుదల చేసింది. కంపెనీ దీనిని A-సిరీస్‌లో తాజా ఎంట్రీగా పరిచయం చేసింది. Samsung Galaxy A17 4G మొబైల్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ఇ-కామర్స్ సైట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 5,000mAh బ్యాటరీ, ప్యానెల్‌పై గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ, 2TB వరకు విస్తరించగలిగే స్టోరేజ్, 50MP ప్రధాన వెనుక కెమెరా ఉన్నాయి. 

Also Read :  రూ.3,099లకే స్మార్ట్‌ టీవీ గురూ.. అమెజాన్‌‌లో అరాచకమైన ఆఫర్..!

Samsung Galaxy A17 4G

జర్మనీలోని ఒక స్థానిక రిటైలర్ Samsung Galaxy A17 4Gని సుమారు రూ. 15,000 కు లిస్ట్ చేసింది. ఈ ధరకు వినియోగదారులు 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ పొందుతారు. అదే వేరియంట్ జర్మనీలోని Samsung అధికారిక వెబ్‌సైట్‌లో ధర వివరాలు వెల్లడించకుండా లిస్ట్ అయింది. అంతేకాకుండా కంపెనీ ఇతర మార్కెట్లలో దాని ధర గురించి ఎలాంటి అధికారిక సమాచారాన్ని ఇవ్వలేదు. Samsung ఇప్పటికే భారతదేశంలో Galaxy A17 5Gని విక్రయిస్తోంది. దీని ధర రూ.18,999 నుండి ప్రారంభమవుతుంది.

Samsung Galaxy A17 4G స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది Android 15-ఆధారిత One UI 7 పై నడుస్తుంది. Galaxy A17 4G ఆరు సంవత్సరాల ప్రధాన OS అప్డేట్‌లు, ఆరు సంవత్సరాల సేఫ్టీ అప్డేట్‌లను పొందుతుంది. ఈ ఫోన్ జెమిని లైవ్, సర్కిల్ టు సెర్చ్ వంటి అనేక AI ఫీచర్లకు కూడా మద్దతు ఇస్తుంది. Galaxy A17 4G మొబైల్ 90Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే MediaTek Helio G99 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను పొందుతుంది. ఈ ఫోన్ 4GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. వినియోగదారులు మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించవచ్చు.

కెమెరా సెటప్ విషయానికొస్తే..Samsung Galaxy A17 4G వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్ (OIS మద్దతుతో), 5MP అల్ట్రావైడ్ లెన్స్, 2MP మాక్రో షూటర్ ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 13MP కెమెరా అందించారు. ఈ ఫోన్‌లో బ్లూటూత్ 5.3, GPS, Wi-Fi, USB టైప్-C పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్‌లు ఉన్నాయి. ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP54 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. Galaxy A17 4G ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 18 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది. 

Also Read :  రచ్చ రచ్చే.. ఐఫోన్ 17 సిరీస్‌ బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు తెలిస్తే పిచ్చెక్కిపోతారు..!

Advertisment
తాజా కథనాలు