Iphone 17లో బయపపడ్డ సాంకేతిక లోపం.. ఒప్పుకున్న యాపిల్.. ఏంటో తెలుసా?

ఓ టెక్ జర్నలిస్ట్ ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లను పరిశీలిస్తున్న సమయంలో బగ్‌ కనిపెట్టాడు. కచేరీ ఫోటోలు తీస్తున్నప్పుడు ప్రతి 10 ఫోటోలలో ఒకటి బ్లాక్ చేసినట్లు ఉందని సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించినట్లు ఆపిల్ తెలిపింది.

New Update
Iphone 17

Iphone 17

ప్రతీ ఏడాది ఆపిల్ కొత్త సిరీస్‌ను లాంఛ్ చేస్తుంది. ఈ ఏడాది ఐఫోన్ 17 సిరీస్‌‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఫోన్ అమ్మకాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ప్రతీ కొత్త సిరీస్‌లో ఆపిల్ తన ఫోన్‌లో కొన్ని మార్పులు చేస్తుంది. అలాగే ఈసారి సన్నగా ఉండే ఐఫోన్ ఎయిర్‌ను విడుదల చేసింది. ఐఫోన్ ఎయిర్‌ చూడటానికి ఎంతో స్లిమ్‌గా, అందంగా ఉంది. అయితే ఈ ఐఫోన్ 17 సిరీస్‌లో సాంకేతిక లోపం ఉన్నట్లు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై ఆపిల్ స్పందిస్తూ.. సాంకేతిక లోపం ఉన్నట్లు ఒప్పుకుంది. ఐఫోన్ ఎయిర్‌తో ఫోటోలు తీస్తున్నప్పుడు బగ్ కనిపించింది. దీంతో యూజర్లు ఆందోళన చెందారు. ఇంతకీ ఏమైందంటే? 

ఇది కూడా చూడండి: IPhone 17 Offers: రచ్చ రచ్చే.. ఐఫోన్ 17 సిరీస్‌ బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు తెలిస్తే పిచ్చెక్కిపోతారు..!

సోషల్ మీడియాలో ట్వీట్ చేయడంతో..

ఓ టెక్ జర్నలిస్ట్ ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లను చూస్తున్నాడు. ఆ సమయంలో మొదటిసారి కెమెరాలో బగ్‌ కనిపెట్టాడు. ఆ జర్నలిస్ట్ కచేరీ ఫోటోలు తీస్తున్నప్పుడు ప్రతి 10 ఫోటోలలో ఒకటి బ్లాక్ చేసినట్లు కనిపించింది. అలాగే వింతగా కనిపించే పెట్టెలు, మరికొన్నింట్లో తెల్లటి గీతలు కనిపించాయి. ఇది అన్నిసార్లు కనిపించలేదు. కొన్నిసార్లు మాత్రమే కనిపించింది. దీంతో ఆ జర్నలిస్ట్ దాన్ని గమనించడం మొదలు పెట్టాడు. ఏయే ఫొటోలు తీస్తుంటే ఇలా జరిగిందో చెక్ చేశాడు.

కేవలం LED డిస్‌ప్లే ఫొటోలు తీసినప్పుడు ఆ బగ్‌ను గుర్తించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. దీనికి ఆపిల్ స్పందించి ఆ బగ్ ఏంటో తెలియజేసింది. లైటింగ్ వల్ల ఏర్పడిన సాఫ్ట్‌వేర్ బగ్ అని పేర్కొంది. వెంటనే ఈ సమస్యను క్లియర్ చేసినట్లు తెలిపింది. అయితే ఐఫోన్ 17 సిరీస్‌లో ఎయిర్‌‌ను ఆపిల్ కొత్తగా విడుదల చేసింది. దీని మందం కేవలం 5.6mm మాత్రమే. ఇప్పటి వరకు ఆపిల్ విడుదల చేసిన అన్ని మొబైల్స్‌లో ఇదే అత్యంత సన్నని మొబైల్. ఈ ఫోన్ ప్రోమోషన్ టెక్నాలజీతో 6.5-అంగుళాల స్క్రీన్‌ ఉంది. దీనికి 48MP సింగిల్ రియర్ కెమెరా,18MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. A19 ప్రో చిప్‌సెట్‌తో నడిచే ఈ ఫోన్ భారతదేశంలో  దీని ధర1,19,900 నుంచి ప్రారంభమవుతుంది. 

ఇది కూడా చూడండి: Smart Tv Offer: భలే ఆఫర్.. రూ.15 వేలకే డాల్బీ స్మార్ట్ టీవీ.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సీజన్‌లో అదిరిపోయే డిస్కౌంట్లు!

Advertisment
తాజా కథనాలు