Milk Prices: వినియోగదారులకు గుడ్ న్యూస్.. 700కి పైగా అమూల్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు!

పాల ఉత్పత్తులపై జీఎస్టీ రేటును తగ్గించడం వల్ల అమూల్ ధరలను తగ్గించింది. కొత్త ధరలు అన్ని కూడా సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని అమూల్ బ్రాండ్ ఉత్పత్తులను మార్కెట్ చేసే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ తెలిపింది.

New Update
Amul Milk

Amul Milk

ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ ధరలను ఇటీవల తగ్గించాయి. ఇటీవల హెరిటేజ్, మదర్ డెయిరీ పాలు, పెరుగు, చీజ్, పనీర్, ఐస్ క్రీం వంటి ప్రొడక్ట్స్‌పై ధరలను తగ్గించగా.. తాజాగా అమూల్(Amul Milk Prices) సంస్థ కూడా ధరలను తగ్గించింది. అయితే పాల ఉత్పత్తులపై జీఎస్టీ రేటును తగ్గించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమూల్ తెలిపింది. కొత్త ధరలు అన్ని కూడా సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని అమూల్ బ్రాండ్ ఉత్పత్తులను మార్కెట్ చేసే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ తెలిపింది. 700కి పైగా ఎక్కువగా ఉన్న ఉత్పత్తులపై ధరలు తగ్గుతాయని వెల్లడించింది.

ఇది కూడా చూడండి: iPhone Discounts: రూ.37 వేల భారీ డిస్కౌంట్‌తో ఐఫోన్.. పిచ్చేక్కించే ఆఫర్లు.. వెంటనే త్వరపడండి!

భారీ డిమాండ్ పెరుగుతుందని..

ఇందులో నెయ్యి, వెన్న, ఐస్ క్రీమ్, చీజ్, పన్నీర్, చాక్లెట్లు, బేకరీ వస్తువులు, ఫ్రోజెన్ స్నాక్స్ వంటివి కూడా ఉన్నాయి. ధరలు తగ్గించడం వల్ల వినియోగదారులు ఎక్కువగా కొంటారని భావించింది. అమూల్ ప్రొడక్ట్‌లో ఎక్కువగా ఐస్ క్రీమ్, చీజ్, వెన్న వంటి వస్తువులు కొనుగోలు చేస్తుంటారని వెల్లడించింది. అయితే 100 గ్రాముల వెన్న ధర రూ.62 నుంచి రూ.58 కి తగ్గింది. లీటరు నెయ్యిపై రూ.40 తగ్గింది. అమూల్ ప్రాసెస్డ్ చీజ్ బ్లాక్ కిలో రూ.30 తగ్గింది. ఫ్రోజెన్ పన్నీర్ 200 గ్రాములు రూ.99 నుంచి రూ.95కి తగ్గింది. ధరలు తగ్గడం వల్ల అమూల్ పాల ఉత్పత్తులకు భారీ డిమాండ్ పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది. 

ఇది కూడా చూడండి: Oppo Festive Sale: ఒప్పో బంపర్ సేల్.. రూ.10లక్షల బహుమతి, ఫ్రీ మొబైల్స్ పొందే అద్భుత అవకాశం..!

Advertisment
తాజా కథనాలు