Mutual Funds: టాప్ మ్యూచ్‌వల్ ఫండ్స్.. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే డబ్బే డబ్బు

టాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్, నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్, కెనరా రోబెకో బ్లూచిప్ ఈక్విటీలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి. ఇవి గత పదేళ్లలో ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెట్టాయి.

New Update
Investments: పదేళ్లలో 10 రూపాయల్ని పదివేలు చేసిన మూడు ఫండ్స్ ఇవే!

Mutual Funds

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు(Mutual Funds Investement) పెట్టడం వల్ల లాభాలు వస్తాయి. రోజురోజుకీ వీటిలో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే కొందరికి బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఏదో తెలియక ఇబ్బంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇలాంటి వాటిలో పెట్టడం వల్ల బాగా నష్టాలను చవి చూస్తారు. తక్కువ పెట్టుబడి పెట్టినా కూడా నష్టాల బాట కాకుండా లాభాలు వచ్చే టాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఎందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభాలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి:  USA: గడ్డకట్టే చలిలో నీళ్ళల్లో పడి బతకడం కష్టమే..ఇప్పటికి 18మంది మృతి

ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్

ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి లాభాలు వస్తాయి. గత 10 సంవత్సరాలలో ఈ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు 12.53 శాతం రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ నిర్వహణలో ఉన్న మొత్తం మార్కెట్ విలువ రూ.61714.99 కోట్లు ఉంది.

నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్
టాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్(Nippon India Large Cap Fund) ఒకటి. ఇందులో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు గత పదేళ్లలో దాదాపుగా 12.46 రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ నిర్వహణలో ఉన్న మొత్తం మార్కెట్ విలువ రూ.34517.63 కోట్ల ఉంది. 

ఇది కూడా చూడండి: తస్సాదియ్యా మామూలోడు కాదయ్యా సిరాజ్ : ఆమెతో కాదు.. ఈమెతో డేటింగ్!

కెనరా రోబెకో బ్లూచిప్ ఈక్విటీ ఫండ్
ఈ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు గత 10 సంవత్సరాలలో 12.07 శాతం రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ నిర్వహణలో ఉన్న మొత్తం మార్కెట్ విలువ రూ.14,196.78 కోట్లు కలిగి ఉంది. 

ఎస్‌బీఐ బ్లూచిప్ ఫండ్
ఇందులో పెట్టుబడిదారులకు గత 10 సంవత్సరాలలో ఈ ఫండ్ 11.62 శాతం రాబడిని అందించింది. ఈ ఫండ్ నిర్వహణలో ఉన్న మొత్తం మార్కెట్ విలువ రూ.48062.06 కోట్లు కలిగి ఉంది. 

ఎడెల్వీస్ లార్జ్ క్యాప్ ఫండ్
ఎడెల్వీస్ లార్జ్ క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు గత పదేళ్లలో 11.40 శాతం రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ నిర్వహణలో ఉన్న మొత్తం మార్కెట్ విలువ రూ.1078.11 కోట్లు కలిగి ఉంది.

ఇది కూడా చూడండి: Maha Kumbh mela: వీవీఐపీల పాస్‌ లు రద్దు..వాహనాలకు కూడా నో ఎంట్రీ..కుంభమేళాలో మార్పులు!

కోటక్ బ్లూచిప్ ఫండ్
ఇందులో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు గత 10 సంవత్సరాలలో 11.24 శాతం రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ నిర్వహణలో ఉన్న మొత్తం మార్కెట్ విలువ రూ.9,025.47 కోట్లు కలిగి ఉంది.

హెచ్‌డీఎఫ్‌సీ లార్జ్ క్యాప్ ఫండ్
హెచ్‌డీఎఫ్‌సీ లార్జ్ క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు గత పదేళ్లలో 11.10 శాతం రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ నిర్వహణలో ఉన్న మొత్తం మార్కెట్ విలువ రూ.34,847.82 కోట్లు కలిగి ఉంది.

ఇది కూడా చూడండి: Siddipet Incident: తల్లీకూతుళ్ల ప్రాణం తీసిన కరువుపని.. సిద్దిపేటలో పెను విషాదం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు