/rtv/media/media_files/2025/01/30/viVpxNmapkWOs8UZNgu2.jpg)
Ptomac River, Washington
వాషింగ్టన్ లోని రీగన్ ఎయిర్ పోర్ట్ లో పీఎస్ఏకు చెందిన విమానం, రక్షణ దళ హెలికాఫ్టర్ గుద్దుకున్నాయి. దీంతో రెండూ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో పడిపోయాయి. విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉండగా...హెలికాఫ్టర్ లో ముగ్గురు సైనికులు ఉన్నట్టు తెలుస్తోంది. విమాన శకలాలతో పాటూ ప్రయాణికులు కూడా పోటోమాక్ నదిలో పడిపోయారు. విమానం రెండు ముక్కలైందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. హెలికాఫ్టర్ తల్లకిందులుగా పడిందని అంటున్నారు. ఇప్పటికి 18మంది మృతదేహాలను నదిలో నుంచి బయటకు తీశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
గడ్డకట్టే చలిలో బతకడం కష్టమే..
అయితే రాత్రి కావడంతో సహాయక చర్యలకు చీకటి, గడ్డకట్టే చలి అవరోధంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం వాషింగ్టన్ లో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉన్నాయి. అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో నమోదవుతోంది. ఈ నేపథ్యంలో పోటోమాక్ నదిలో ఉష్ణోగ్రతలు కూడా -1 నుంచి -2 సెల్సియస్ వరకు ఉండొచ్చని అక్కడి నేషనల్ వెదర్ సర్వీస్ చెబుతోంది. ఈ కారణంగా నదిలో పడిపోయిన వారి శరీరాలు కోల్డ్ షాక్ కు గురి కావచ్చని నిపుణులు చెబుతున్నారు. నదిలో గడ్డకట్టే నీటి వలన ఊపిరి ఆడకపోవడం, శ్వాస తీసుకోలేక పోవడం జరగవచ్చని చెబుతున్నారు. నీటిలో పడ్డాక బాధతులు ఎక్కువసేపు బతికుండ లేకపోవచ్చని అంటున్నారు. హైపోథెర్మియా అనే పరిస్థితికి గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నారు. బయట ఉన్న చలి వాతారణం కంటే నీటిలో ఉండే చల్లదనం మనిషిలో ఉన్న వేడిని తొందరగా తగ్గిస్తుంది. ఇది 26 రెట్లు ఎక్కువగా ఉంటుంది. దీంతో కేవలం మూడు నిమిషాల్లోనే మనుషులు శక్తిని కోల్పోతారు. 15 నిమిషాల్లో స్పృహ కోల్పోతారు. అదే గాయపడి ఉంటే 30 నుంచి 90నిమిషాల్లో ప్రాణాలు కూడా పోతాయని చెబుతున్నారు. ఇలాంటి కండిషన్ లో ప్రస్తుతం విమాన ప్రమాద బాధితులు బతికున్నారని అనుకోవడం కష్టమేనని అంటున్నారు నేషనల్ వెదర్ సర్వీసెస్ అధికారులు.
Also Read: USA: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఢీ కొన్న విమానం, హెలికాఫ్టర్
సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ట్రంప్
విమాన ప్రమాదం సంగతి అధ్యక్షుడు ట్రంప్ కు అధికారులు తెలియజేశారు. దంతో ఆయన స్వయంగా గాలింపు చర్యలను పర్యవేక్షిస్తానని తెలిపారు. ట్రంప్ ఎప్పటికప్పుడు అధికారులను సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు రీగన్ ఎయిర్ పోర్ట్ కు వచ్చే విమానాలను వేరే చోటికి మళ్లిస్తున్నారు. ఇక్కడ కార్యకలాపాలను పూర్తిగా నిలిపేశారు. అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్ పోర్ట్ లలో రీగన్ ఒకటి. రోజుకు ఇక్కడ నుంచి 800 విమానాలు రాకపోకలు జరుపుతాయి. ఇక ప్రమాదానికి గురైన బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను శిక్షణకు వాడుతున్నట్లు అమెరికా సైనిక వర్గాలు ధ్రువీకరించాయి. విమానాన్ని ఢీకొన్న సమయంలో కూడా అందులో శిక్షణ ఇస్తున్నట్లు చెబుతున్నారు.