/rtv/media/media_files/2025/01/30/T6TvceqswU4RJa3u1Flp.jpg)
siddipet incident
Siddipet Incident: పొట్టకూటి కోసం కరువు పనికెళ్లిన తల్లీకూతుళ్లు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. పనిలో బండరాళ్లు మీద పడి అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. భార్యబిడ్డ ఇకలేరని తెలిసిన ఆ ఇంటాయన, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. ఈ విషాదకరమైన ఘటన సిద్దపేట జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read: Air Pollution: వాయు కాలుష్యంతో చిన్నపిల్లల్లో బ్రెయిన్ సమస్యలు .. తాజా అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు !
బండరాళ్లు మీదపడి
సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన కొంతమంది కూలీలు ఉపాధి హామీ పనుల్లో భాగంగా గ్రామా శివారులో మట్టి తవ్వటానికి వెళ్లారు. ఈ క్రమంలో మట్టి దిబ్బలను తవ్వుతుండగా ఒక్కసారిగా దిబ్బలు కూలి.. కూలీల పై పడ్డాయి. ఈ ప్రమాదంలో తల్లి సరోజ, కూతురు మమత బండరాళ్ల కిందపడి అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న రెవెన్యూ శాఖా అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగించి, మృతదేహాలను బయటకు తీశారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసపత్రికి తరలించారు.
Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్ కార్డు మార్చాలి.. స్టార్ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో గుంత తీసే క్రమంలో ఇద్దరి ఉపాధి హామీ కూలీలు మరణించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన కారణాల పై జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. ఉపాధి హామీ లో ఇద్దరి మరణానికి…
— Ponnam Prabhakar (@Ponnam_INC) January 30, 2025
స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్ధిపేట ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. గోవర్ధనగిరి గ్రామంలో గుంతలు తీసే క్రమంలో ఇద్దరు ఉపాధి హామీ కూలీలు మరణించడం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. ఉపాధి హామీ పనుల్లో ఇద్దరి మరణానికి కారణమైన ఘటనపై జిల్లా అధికారులను విచారణకు ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. అలాగే మరణించిన కుటుంబాలకు, గాయపడిన వారికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.