/rtv/media/media_files/2025/01/23/dRgNIyBD6vV33JRzTuV6.jpg)
Mahakumbh Mela
ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న ఆధ్మాత్మిక వేడుక మహా కుంభమేళాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా నెలకొన్న రద్దీతో తొక్కిసలాట జరిగి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కుంభమేళా నిర్వహణలో కీలక మార్పులు చేసింది.
వీవీఐపీ పాస్ లను పూర్తిగా రద్దు చేసింది. బుధవారం అర్థరాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.అనంతరం సంబంధించిన మార్పులను ప్రభుత్వం ప్రకటించింది.
భక్తుల రద్దీని నియంత్రించేందుకు మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలోకి ఎలాంటి వాహనాలు ప్రవేశించకుండా యోగి సర్కారు నిషేధం విధించింది.ఈ ప్రాంతాన్నినో వెహికల్ జోన్ గా ప్రకటించింది. వాహనాల ప్రవేశానికి ఎలాంటి మినహాయింపులు లేవని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
వీవీఐపీ, స్పెషల్ పాస్ లను రద్దు...
వీవీఐపీ, స్పెషల్ పాస్ లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ప్రయాగ్‌రాజ్ (Prayagraj) నగరంలోకి ఫోర్ వీలర్ వాహనాలు ప్రవేశించకుండా నిషేధం విధించింది. భక్తుల సౌకర్యార్థం కుంభమేళా జరుగుతున్న ప్రాంతంలో వన్ వే రూట్ ట్రాఫిక్ వ్యవస్థను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది.
చిరు వ్యాపారులు రోడ్ల పై దుకాణాలు పెట్టుకుంటే వాటిని వెంటనే ఖాళీ స్థలాల్లోకి మార్చాలని స్థానిక యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పింది. మేళా ప్రాంతంలో పెట్రోలింగ్ ను పెంచాలని పోలీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
భక్తులు ఎక్కడా ఆగకుండా వారికి అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించింది.
Also Read: USA: బైడెన్ వదిలేయమన్నారు..ట్రంప్ తొందరగా తీసుకురమ్మన్నారు..వ్యోమగాములపై మస్క్