తస్సాదియ్యా మామూలోడు కాదయ్యా సిరాజ్ : ఆమెతో కాదు.. ఈమెతో డేటింగ్!

బిగ్ బాస్ కంటెస్టెంట్ మహిరా శర్మతో సిరాజ్ డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై మహిరా తల్లి సానియా క్లారిటీ ఇచ్చారు. మహీరా గతంలో పరాస్ ఛబ్రాతో మూడు సంవత్సరాల పాటు డేటింగ్ చేసింది. 2023లో వీరిద్దరూ విడిపోయారు.  

New Update
siraj, mahira

siraj, mahira Photograph: (siraj, mahira )

భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ పేరు ఈ మధ్య వార్తల్లో తెగ నిలుస్తోంది. ఆ మధ్య సింగర్ ఆశా భోంస్లే మనవరాలు  జనాయ్ భోంస్లేతో సిరాజ్ డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆమె తనకు సోదరి లాంటిది అని చెప్పుకొచ్చాడు. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు సిరాజ్.  బిగ్ బాస్ 13 కంటెస్టెంట్ మహిరా శర్మతో సిరాజ్ డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి.  

అయితే ఈ వార్తలపై మహిరా తల్లి సానియా శర్మ క్లారిటీ ఇచ్చారు.  తన కూతురు సెలబ్రిటీ కాబట్టి ఎవరైనా ఏమైనా చెప్తారు. అన్ని నమ్ముతారా అంటూ చెప్పుకొచ్చింది.  ఇవన్ని ఫేక్ వార్తలని కొట్టిపారేసింది. మహీరా గతంలో పరాస్ ఛబ్రాతో మూడు సంవత్సరాల పాటు డేటింగ్ చేసింది, 2023లో వీరిద్దరూ విడిపోయారు.  

Also Read :  ఎమ్మెల్యే సంతకాన్నే ఫోర్జరీ చేసి....

ఇటీవల మహమ్మద్ సిరాజ్-మహీరా శర్మ రిలేషన్ షిప్‌లో ఉన్నారని ..  ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం తీసుకుంటున్నారంటూ ఓ రూమర్ బయటకు వచ్చి్ంది.  అయితే, దీనిపై మహీరా, సిరాజ్ నుండి ఎటువంటి ప్రకటన రాలేదు, కానీ మహిరా తల్లి ఈ వార్తలను ఖండించింది.  మహీరా శర్మ, మహ్మద్ సిరాజ్ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో కూడా కావడం లేదు.  

మహిరా శర్మ విషయానికి వస్తే..  ఈమె కశ్మీర్ నివాసి.తన చదువు తర్వాత నటి ముంబైకి వచ్చి అక్కడ గ్రాడ్యుయేషన్ చేసింది. టీవీ సీరియల్స్‌తో పాటు అనేక మ్యూజిక్ వీడియోలులో కూడా కనిపించింది . హిందీ, పంజాబీ టెలివిజన్ షోలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.  సల్మాన్ ఖాన్ రియాల్టీ షో బిగ్ బాస్ లో మహీరా శర్మ కనిపించింది.  ఈ షో తర్వాత ఆమె మరింత ఫేమస్ అయ్యింది. ఈ షోలో తన తోటి కంటెస్టెంట్ పరాస్ ఛబ్రాతో ఆమె డేటింగ్ చేసింది.

Also Read :   15 ఏళ్లుగా లవ్.. విశాల్తో డేటింగ్.. పెళ్లిపై ఓపెన్ అయిన అభినయ!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు