ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు-PHOTOS
కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు స్థానిక మహిళలు, రైతులతో కలిసి కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు బస్సు లో ప్రయాణించారు. ప్రజలను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు స్థానిక మహిళలు, రైతులతో కలిసి కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు బస్సు లో ప్రయాణించారు. ప్రజలను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
తనపై తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కుట్ర అంటూ వైసీపీ ప్రచారం చేస్తోందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇలాంటి సంప్రదాయం తమ కుటుంబంలో లేదన్నారు. రాజ్యం కోసం సొంత ఇంట్లో వాళ్లను చంపే రాజకీయం వైసీపీ డీఎన్ఏలోనే ఉందన్నారు.
సీ-ఓటర్ ఇండియా టుడేతో కలిసి 'మూడ్ ఆఫ్ ది నేషన్' (MOTN) అనే సర్వే నిర్వహించింది. ఇందులో దేశంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన CMగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అగ్రస్థానంలో నిలిచారు. 2వ స్థానంలో వెస్ట్ బెంగాల్ CM మమతా బెనర్జీ, తర్వాత ఏపీ CM చంద్రబాబు ఉన్నారు.
మళ్లీ వాయవ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఐదో తేదీకి ఇది వాయుగుండంగా మారుతుంది. దీంతో ఏపీతో పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి కుట్ర జరిగిందన్న వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. శ్రీధర్ రెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు అంటూ ఐదుగురు రౌడీ షీటర్లు మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విశాఖ బీచ్ రోడ్డులో డబుల్ డెక్కర్ బస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులతో కలిసి బస్సులో ప్రయాణించారు. 24 గంటల పాటు ప్రయాణించేలా టికెట్ ఛార్జీని రూ.500 పెట్టారు.
ఏపీ ఆర్టీసీ బస్సులో తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఓ ప్రయాణికురాలు రెచ్చిపోయింది. తాను చున్నీ వేసిన సీటులో ఓ పురుషుడు కూర్చున్నాడని బూతులతో అతన్ని వాయించింది. నా సీటులో ఎందుకు కూర్చున్నావ్.. సిగ్గు లేదా అంటూ అతనిపై బూతులతో విరుచుకపడింది.
కాకినాడ జిల్లా తునిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. రైలు ఢీకొని తండ్రీకొడుకులు దుర్మరణం పాలయ్యారు. మృతులను గుంటూరు జిల్లా పాయకరావుపేటకు చెందిన అనిల్ (30), అతని కుమారుడు అర్జున్ (5)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విజయనగరంలో ఉగ్ర మూలాల కేసులో ఎన్ఐఏ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఇందులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రవాదులకు సహకరించిన కీలక వ్యక్తి ఆరిఫ్ ను అధికారులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ఇతను దేశం విడిచి పారిపోతుండగా పట్టుకున్నారు.