/rtv/media/media_files/2025/08/29/ap-bus-2025-08-29-16-00-11.jpg)
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఫ్రీ బస్సు మొదలైంది. దానితో పాటు గొడవలు కూడా స్టార్ట్ అయ్యాయి. సీటు దొరకలేదని, బస్సు ఆపలేదని మహిళలు రెచ్చిపోతున్నారు. ఏకంగా కొట్లాటకు దిగుతున్నారు. తాజాగా ఏపీ ఆర్టీసీ బస్సులో తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఓ ప్రయాణికురాలు రెచ్చిపోయింది. తాను చున్నీ వేసిన సీటులో ఓ పురుషుడు కూర్చున్నాడని బూతులతో అతన్ని వాయించింది. నా సీటులో ఎందుకు కూర్చున్నావ్.. సిగ్గు. లజ్జ లేదా అంటూ అతనిపై బూతుల పురాణం అందుకుంది. దీంతో అతను కూడా తిరిగి మహిళను తిట్టడంతో గొడవ తారాస్థాయికి వెళ్లింది. అతడిని చేతితో కొడుతూ అసభ్య పదజాలంతో దూషించింది మహిళ. దీంతో ఇద్దరూ చెప్పులతో ఎడాపెడా కొట్టుకున్నారు. అతడు సీటులో నుంచి లేచిపోయేవరకు మహిళ అతన్ని వదిలిపెట్టలేదు. ఆమె పోరు భరించలేక అతడు అక్కడినుంచి లేచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://x.com/TeluguScribe/status/1961370944066523353
తెలంగాణలో కూడా ఇలాగే
తెలంగాణలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ లో ఓ మహిళా బస్సు ఆపలేదని ఏకంగా కండక్టర్ పీక పట్టుకుంది. ఫలక్‌నుమా నుండి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సులో మహిళా కండక్టర్‌పై దాడి చేసింది మహిళా ప్రయాణికురాలు. బస్సు ఆపాలని ప్రయాణికురాలు డ్రైవర్ ను కోరగా ఎక్కడ పడితే అక్కడ ఆపమని చెప్పినందుకు డ్రైవర్, మహిళా కండక్టర్ పై బూతుపురాణం అందుకుంది. అంతేకాకుండా కండక్టర్ పై దాడికి దిగింది. ఏకంగా ఆమె పీక పట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.