Crime News: షాకింగ్.. గణపతి నిమజ్జనంలో అపశ్రుతి.. స్పాట్‌లోనే ఆరుగురు మృతి!

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ట్రాక్టర్ డ్రైవర్ మధ్యలో దిగడంతో మరో యువకుడు నేర్చుకోవడానికి నడపగా దూసుకెళ్లి స్పాట్‌లోనే నలుగురు మృతి చెందారు. అల్లూరి సీతారామరాజులో ఇలాంటి ఘటన జరిగి ఇద్దరు మృతి చెందారు.

New Update
Ganesh

Ganesh

దేశవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్నిచోట్ల విషాద ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. గణపతి నిమజ్జన వేడుకల్లో ట్రాక్టర్ అదుపు తప్పి స్పాట్‌లోనే ఆరుగురు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఇలాంటి విషాద ఘటనలు వేర్వేరు ప్రాంతాల్లో కూడా జరిగాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో గణేష్ నిమజ్జన వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ మధ్యలో విశ్రాంతి తీసుకునేందుకు రెండు నిమిషాలు కిందకు దిగారు. దీంతో ఓ యువకుడు ట్రాక్టర్ నడిపేందుకు ప్రయత్నించాడు. అప్పుడు ట్రాక్టర్ అదుపు తప్పి ముందు ఉన్న వారిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే నలుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

ఇది కూడా చూడండి: Crime: తల్లి వివాహేతర సంబంధం.. ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన కొడుకు

ఏపీలోనే మరో జిల్లాలో..

ఇదిలా ఉండగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా వినాయక నిమజ్జనంలో ఇలాంటి విషాద ఘటన చోటుచేసుకుంది.  జాతీయ రహదారి నుంచి అతివేగంతో వచ్చిన ఎస్‌యూవీ  థింసా నృత్యం చేస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో స్పాట్‌లోనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

కరెంట్ షాక్ కొట్టి..

ఇదిలా  ఉండగా తెలంగాణలోని హైదరాబాద్‌లో వినాయక చవితి నాడు కరెంట్ షాక్ కొట్టి మృతి చెందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రవీంద్ర నాయక్ నగర్‌లో ఓ గణేష్ మండపం దగ్గర బ్యానర్ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కరెంట్ షాక్ కొట్టి భరత్ అనే యువకుడు స్పాట్‌లోనే మృతి చెందాడు. అయితే చవితి రోజు ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. 

గణేష్ మండపంలో పాటలు పెడుతుండగా 11 ఏళ్ల బాలుడు మృతి..

ఇదిలా ఉండగా నల్గొండ జిల్లాలోని హాలియా మున్సిపాలిటీ పరిధిలో అనుముల కేవీ కాలనీలోనూ కరెంట్ షాక్‌తో బాలుడు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. గణేష్ మండపంలో విద్యుత్ షాక్‌ అయ్యి 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మృతుడు దండెమ్ మహేందర్, మౌనికల కుమారుడు మణికంఠగా గుర్తించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న మణికంఠ శుక్రవారం గణేష్ మండపంలో పాటలు పెడుతుండగా విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న హాలియా సీఐ సతీష్ రెడ్డి, ఎస్సై సాయి ప్రశాంత్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మండపాలలో విద్యుత్ పనులు ఎలక్ట్రీషియన్లతోనే చేయించాలని అధికారులు చెబుతున్నారు. పిల్లలను వీటి విషయంలో అసలు ఇన్వాల్వ్ చేయకూడదు. వారిని ఈ వినాయక చవితి సమయంలో పిల్లలను జాగ్రత్తగా ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Missing Case: 3 రోజుల క్రితం అదృశ్యమైన మహిళ.. కట్‌ చేస్తే నదిలో మృతదేహాం

Advertisment
తాజా కథనాలు