/rtv/media/media_files/2025/08/29/kotamreddy-sridhar-reddy-2025-08-29-17-05-04.jpg)
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి కుట్ర జరిగిందన్న వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. శ్రీధర్ రెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు అంటూ ఐదుగురు రౌడీ షీటర్లు మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హత్య ప్లాన్ వెనుక రౌడీషీటర్లు జగదీశ్, మహేశ్, వినీత్, మరో ఇద్దరు రౌడీషీటర్ శ్రీకాంత్ ఉన్నట్లు తెలుస్తోంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య కుట్ర వెనుక వైసీపీ పెద్దల హస్తమని ఆయన అనుచరులు అనుమానిస్తున్నారు. కోటంరెడ్డిని హతమారిస్తే, రాబోయే ఎన్నికల్లో గూడూరు, సూళ్లూరుపేటలో ఓ టికెట్ ఇస్తామని వైసీపీ పెద్దలు హామీ ఇచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ తరహాలో అంతమొందించాలని కుట్రపన్నారని నెల్లూరు జిల్లాలో చర్చ సాగుతోంది. అయితే.. ఈ విషయం ఐదు రోజుల క్రితమే పోలీసులకు శ్రీధర్ రెడ్డి అనుచరులు తెలిపినట్లు తెలుస్తోంది. కానీ వారు పట్టించుకోలేదన్న టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఇప్పుడు ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న అంశంపై నెల్లూరు పాలిటిక్స్ లో ఉత్కంఠ నెలకొంది.
బ్రేకింగ్ న్యూస్
— Swathi Reddy (@Swathireddytdp) August 29, 2025
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర
కోటంరెడ్డి హత్యకు కుట్ర పన్నిన రౌడీషీటర్ శ్రీకాంత్, లేడీ డాన్ అరుణ?
పోలీసుల చేతికి చిక్కిన సంచలన వీడియో @kotamreddy_NLR@JaiTDPpic.twitter.com/yawc87gsvQ
కోటంరెడ్డి హత్యకు కుట్ర అన్న వార్తలపై నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ స్పందించారు. ఈ విషయం తమ నోటీస్ కు వచ్చిందని వెల్లడించారు. దీనిపై విచారణ చేస్తున్నామని త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.