MOTN Survey: సంచలన సర్వే.. దేశంలో బెస్ట్ CM ఎవరో తెలుసా?

సీ-ఓటర్ ఇండియా టుడేతో కలిసి 'మూడ్ ఆఫ్ ది నేషన్' (MOTN) అనే సర్వే నిర్వహించింది. ఇందులో దేశంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన CMగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అగ్రస్థానంలో నిలిచారు. 2వ స్థానంలో వెస్ట్ బెంగాల్ CM మమతా బెనర్జీ, తర్వాత ఏపీ CM చంద్రబాబు ఉన్నారు.

New Update
MOTN survey

MOTN survey

సీ-ఓటర్ ఇండియా టుడేతో కలిసి 'మూడ్ ఆఫ్ ది నేషన్' (MOTN) అనే సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా అత్యధిక ప్రజాధరణ పొందిన ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై సర్వే చేశారు. ఇందులో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(up-cm-yogi-adityanath) మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. తాజా సర్వే ప్రకారం, యోగి ఆదిత్యనాథ్ ప్రజాదరణ రేటింగ్ స్వల్పంగా పెరిగి, అత్యధికంగా 36శాతానికి చేరుకుంది. 2025 జూలై 1 నుంచి ఆగస్టు 14 మధ్య ఈ సర్వే కోసం దేశవ్యాప్తంగా 54,788 మంది ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ఇందులో అదనంగా సీ-ఓటర్ రెగ్యులర్ ట్రాకర్ డేటా నుండి 1,52,038 ఇంటర్వ్యూలను కూడా విశ్లేషించారు. మొత్తం 2,06,826 మంది అభిప్రాయాలను ఈ నివేదిక కోసం పరిగణనలోకి తీసుకున్నారు. యోగి ఆదిత్యనాథ్ దేశంలోనే బెస్ట్ సీఎంగా నిలవడం వరసగా ఇది మూడవ సారి. ఆయన కఠినమైన నిర్ణయాలు, నేరస్తులపై తీసుకుంటున్న చర్యలు, ముఖ్యంగా 'బుల్డోజర్ మోడల్' ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. 

Also Read :  త్వరలో వచ్చేస్తున్న జియో ఐపీఓ.. మెటాతో కలిసి సరికొత్త ఏఐ కంపెనీ !

MOTN Survey - Best CM Yogi Adityanath

ఈ జాబితాలో రెండవ స్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) (13%) నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (7%) మూడవ స్థానంలో ఉన్నారు. ఈ సర్వేలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరు, ప్రజాదరణపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. చిన్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మొదటి స్థానంలో ఉన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి మాత్రం ఇందులో ప్రస్తావించలేదు. 

యూపీలో శాంతిభద్రతల మెరుగుదల, అవినీతి నిర్మూలన, అభివృద్ధి కార్యక్రమాల అమలు వంటి అంశాలు యోగి ఆదిత్యనాథ్ ప్రజాదరణకు ప్రధాన కారణాలుగా ఈ సర్వే నివేదించింది. అయితే, తన సొంత రాష్ట్రంలో మాత్రం ఆయన ప్రజాదరణ కొంత మేర తగ్గినట్లు గతంలో వచ్చిన సర్వేలు సూచించాయి. కానీ, దేశవ్యాప్తంగా మాత్రం ఆయనకు తిరుగులేని ఆదరణ ఉన్నట్లు ప్రస్తుత MOTN సర్వే స్పష్టం చేసింది. 

Also Read :  లవర్‌ను పెళ్లి చేసుకుందామని లేచిపోయిన అమ్మాయికి ఎదురుదెబ్బ.. సినిమా మాదిరి ట్విస్ట్

ఈ సర్వే నివేదిక ప్రకారం, ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) తర్వాత బీజేపీలో ప్రధాని అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్‌కు ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు కూడా వెల్లడైంది. ఈ నివేదిక దేశ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఈ సర్వేలో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత బీజేపీలో ప్రధాని అభ్యర్థిగా ప్రజలు ఎవరిని ఇష్టపడుతున్నారని అడగ్గా, 28% మంది హోంమంత్రి అమిత్ షాను, 26% మంది యోగి ఆదిత్యనాథ్‌ పేరు చెప్పినట్లు నివేదిక తెలిపింది. ఇది యోగి ఆదిత్యనాథ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాదరణకు అద్దం పడుతోంది.