🔴Live News: నేడు వరల్డ్ ఎర్త్ అవర్ డే.. రాత్రి 8.30 నుంచి 9.30 మర్చిపోవద్దు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం చినకాపావరంలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఒంటిపూట బడులు కావడంతో పాఠశాల అయ్యాక కాలువలో స్నానానికి వెళ్లారు. మృతులు 5వ తరగతి చదువుతున్న సాయి పవన్, శరత్ కుమార్‌గా గుర్తించారు.
నంద్యాల లో వైసీపీకి నంద్యాల సుధాకర్ రెడ్డి (48) ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. గత కొంతకాలంగా గ్రామంలో కొందరితో విభేధాలు ఉన్నాయని స్థానికులు తెలిపారు.పొలం నుంచి తిరిగి వస్తుండగా ఈ దారుణ ఘటన జరిగింది.
దువ్వాడ శ్రీనివాస్‌ను డాక్టరేట్ వరించినట్లు తెలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో US ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్ చేతుల మీదుగా ‘డాక్టరేట్’ బిరుదు పొందినట్లు సమచారం. దీనికి సంబంధించి ఒక పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.
డీలిమిటేషన్‌పై ఆందోళన నెలకొన్న వేళ వైసీపీ అధినేత జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2026లో జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ద్వారా సీట్ల తగ్గింపు లేకుండా చూడాలని కోరారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఏపీలో ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావారణ శాఖ ఓ చల్లటి వార్త చెప్పింది. ఏపీలో నాలుగు రోజుల పాటూ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో 3రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో 22 జిల్లాలకు ఎల్లో, 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్నిచోట్ల ఈదురుగాలులతో వడగళ్ల వాన కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సుబ్బయ్య గారి హోటల్‌కు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న సుబ్బయ్య గారి హోటల్లో తెలంగాణ టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విజువల్స్ బయటపడ్డాయి. ఆ హోటల్లో పరిశుభ్రత లేదని అధికారులు తెలిపారు.
నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో జననీ సహకార పరపతి పొదుపు సంఘం మహిళా బ్యాంకు పేరుతో ఘరానా మోసం బయటపడింది. బోర్డు తిప్పేసేందుకు సిద్ధమైన జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ సీఈవో వెంకటరమణ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయ్యాడని సెక్రటరీ పద్మావతి ఆరోపిస్తున్నారు.