YS Jagan: డీలిమిటేషన్‌పై ఆందోళన.. ప్రధాని మోదీకి జగన్ సంచలన లేఖ

డీలిమిటేషన్‌పై ఆందోళన నెలకొన్న వేళ వైసీపీ అధినేత జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2026లో జరగబోయే డీలిమిటేషన్‌ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ద్వారా సీట్ల తగ్గింపు లేకుండా చూడాలని కోరారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
YS Jagan and PM Modi

YS Jagan and PM Modi

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, మజీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2026లో జరగబోయే డీలిమిటేషన్‌ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. '' దక్షిణాది రాష్ట్రాల్లో గత 15 ఏళ్లలో జనాభా బాగా తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకే ఇక్కడ జనాభా నియంత్రణ జరిగింది.  

Also Read: బండి సంజయ్‌కి తప్పిన ప్రమాదం.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

జనాభా ఆధారంగా డీలిమిటేషన్‌ ప్రక్రియ జరిగితే తమ రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ నడుస్తోంది. ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ అమలు చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు కచ్చితంగా సీట్లు తగ్గిపోతాయి. అందుకోసమే జనాభా లెక్కల ప్రకారం ఈ డీమిలిటేషన్ జరగకుండా చూడండి. పార్లమెంటులో తీసుకునే నిర్ణయాల్లో రాష్ట్రాలకు సమానమైన భాగస్వామ్యం కల్పించేలా చూడాలి.  

Also Read: సునీతా విలియమ్స్‌కు ఓవర్‌టైమ్‌ జీతం చెల్లిస్తా : ట్రంప్

దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ద్వారా సీట్ల తగ్గింపు లేకుండా చూడాలి. ఈ కోణంలో ఆలోచన చేసి డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నాను. లోక్‌సభ, రాజ్యసభలో ఏ రాష్ట్రానికి కూడా ప్రాతినిధ్యం తగ్గకుండా నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానని'' జగన్‌ లేఖలో రాసుకొచ్చారు. ఇదిలాఉండగా.. డీలిమిటేషన్ ప్రక్రియపై సీఎం స్టాలిన్ నేతృత్వంలో శనివారం వివిధ రాష్ట్రాల పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కూడా హాజరయ్యారు. 

Also Read: నేడు వరల్డ్‌ ఎర్త్‌ అవర్‌ డే.. రాత్రి 8.30 నుంచి 9.30 మర్చిపోవద్దు

Also Read: చైనాను వణికించే ఫైటర్ జెట్..వరల్డ్ బెస్ట్ అంటున్న ట్రంప్

telugu-news | delimitation | national-news | ys-jagan | pm modi 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు