Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌కు ‘డాక్టరేట్’.. ఎందుకో తెలుసా?

దువ్వాడ శ్రీనివాస్‌ను డాక్టరేట్ వరించినట్లు తెలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్‌లో US ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్ చేతుల మీదుగా ‘డాక్టరేట్’ బిరుదు పొందినట్లు సమచారం. దీనికి సంబంధించి ఒక పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Duvvada Srinivas Doctorate

Duvvada Srinivas Doctorate

ఆంధ్రప్రదేశ్‌ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను డాక్టరేట్ వరించినట్లు తెలుస్తోంది. ఈ రోజు హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్‌లో అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్ చేతుల మీదుగా శ్రీనివాస్ ‘డాక్టరేట్’ సత్కారం పొందినట్లు సమాచారం.

విశిష్ట సేవలను

దీనికి సంబంధించి ట్విట్టర్ (ఎక్స్)లో ఒక పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. డే స్ప్రింగ్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ద్వారా.. దువ్వాడ శ్రీనివాస్ తన వృత్తి పట్ల అంకితభావం, సమాజంలో విశిష్ట సేవలను గుర్తిస్తూ ‘డాక్టరేట్’ ను ప్రదానం చేసినట్లు ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ సందర్బంగా (IIFA) ఇండో - ఇజ్రయల్ ఫ్రెండ్ షిప్ అసోసియేషన్ జాతీయ చైర్మన్ డా. ఆడమ్ రాజ్ డెక్కపాటి, రెవరెండ్ సొల్మన్ గట్టు, మణిపూర్ నుండి బిషప్ పోతన్, మాజీ ఎంపీ హర్షకుమార్, మున్సిపల్ చైర్మన్ సరస్వతి, దివ్వెల మాధురి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అశోక్ గౌడ్, రాజయ్య గౌడ్,పల్లె వెంకట్ గౌడ్, శంకర్ గౌడ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

(duvvada-srinivas | andhra-pradesh | latest-telugu-news | telugu-news)

Advertisment
తాజా కథనాలు