Ap Weather: ఏపీ ప్రజలకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో నాలుగు రోజులు వానలే..వానలు!

ఏపీలో ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావారణ శాఖ ఓ చల్లటి వార్త చెప్పింది. ఏపీలో నాలుగు రోజుల పాటూ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

New Update
ap rains

ap rains

ఏపీలోని పలు జిల్లాల్లోవాతావరణశాఖ వర్షాలు కురుస్తాయంటోంది . రాబోయే రాష్ట్రంలో నాలుగు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలకు అవకాశం ఉందని అంచనా వేస్తన్నారు. పలు జిల్లాల్లో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుందని.. ఈ వర్షాలతో కొద్దిరోజులుగా వడగాలులు, తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగినట్లు అయ్యింది.

Also Read: Telangana Rains:తెలంగాణలో భారీ వర్షాలు.. మరో రెండు రోజులూ ఇదే పరిస్థితి..!

శనివారం  శ్రీకాకుళం ,విజయనగరం, పార్వతీపురం మన్యం మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వడగాల్పులు 18 మండలాల్లో వీచే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. శుక్రవారం నంద్యాల జిల్లా చాగలమర్రి లో 40.9 డిగ్రీలు, కర్నూలు జిల్లా కోసిగిలో 40.6 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.2 డిగ్రీలు, కడప జిల్లా ఒంటిమిట్ట, అన్నమయ్య జిల్లా గాదెలలో 40.1 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు, అలాగే 28 మండలాల్లో వడగాల్పులు వీచాయి' అని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

Also Read: Breaking News: రోడ్డు ప్రమాదంలో అడిషనల్‌ డీసీపీ స్పాట్‌ డెడ్‌!

మరోవైపు ఒడిశా మధ్య ప్రాంతాల నుంచి దక్షిణ విదర్భ వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా ఏర్పడిన ద్రోణి బలహీన పడిందని అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో నైరుతి దిశగా గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల్లో వాతావరణం మారుతుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, పిడుగులు ఉరుములతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయి. 

అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల వానలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇటు తెలంగాణలో సైతం వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం రాత్రి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలు విపరీతంగా పడుతున్నాయి. తెలంగాణలో మార్చి 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటువర్షాలు కురుస్తాయంటున్నారు. తెలంగాణలో వానలతో ప్రజలకు వడగాలుల నుంచి ఉపశమనం పొందనున్నారు.

Also Read: London Airport: లండన్‌ ఎయిర్‌ పోర్టులో మంటలు 1350 విమానాలకు అంతరాయం!

Also Read: Samsung Tv Offers: హాట్ హాట్ శాంసంగ్ సేల్.. టీవీలపై భారీ డిస్కౌంట్- సగం ధరకే సౌండ్ బార్‌!

Tags : ap-weather | AP Weather Alert | ap weather news | ap weather today | ap weather updates | ap weather update today | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు