Rain alert: ఈ జిల్లాల్లో వర్షం దంచుడే.. ఈదురు గాలులు, వడగళ్ల వాన

తెలుగు రాష్ట్రాల్లో 3రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో 22 జిల్లాలకు ఎల్లో, 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్నిచోట్ల ఈదురుగాలులతో వడగళ్ల వాన కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Update

తెలుగు రాష్ట్రాల్లో బాణుడి భగభగలకు వర్షాలు బ్రేక్ ఇచ్చాయి. వర్షాల కారణంగా మూడురోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమైయ్యాయి. రోడ్లపై చెట్లు విరిగిపడటంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలంలో పలు చోట్ల వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కుండపోత వర్షం కురిసింది.

Also read: Banks closed: దేశవ్యాప్తంగా 4 రోజులు బ్యాంకులు బంద్!

మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, దండేపల్లి వడగళ్ల వాన కురిసింది. కాగజ్ నగర్‌లో దుకాణాలపై కప్పులు కూడా ఎగిరిపోయాయి. పోచమ్మ గుడి  ముందున్న సుమారు 150 ఏళ్ల వృక్షం నేలమట్టం అయ్యింది. దీంతో వాహనాలను ఆ మార్గం నుంచి వెళ్లకుండా దారి మళ్లిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో మంథని, రామగిరి, ముత్తారం, కమాన్‌పూర్, మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. సుల్తానాబాద్ మండలం నారాయణపూర్, ఎలిగేడు మండలం దూళికట్టలో వడగళ్ల వాన పడింది. అకాల వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం వ్యాప్తంగా మోస్తరు వర్షం కురుస్తోంది. బోయిన్‌పల్లి రామడుగు మల్యాల మండలాల్లో మోస్తరు కంటే ఎక్కువ వర్షం కురుస్తోంది.

శుక్ర, శని వారాల్లో తెలంగాణ, శని, ఆదివారాల్లో ఆంధ్రప్రదేశ్‌లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటలకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతొ బలమైన ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తం చేస్తున్నారు.

Also read: Meerut murder mystery: భర్తను చంపి భార్య ముక్కలు చేస్తే.. ఆమె ప్రియుడు తల, చేతులు తీసుకెళ్లి చేతబడి

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాల పల్లి, పెద్దపల్లి, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Advertisment
తాజా కథనాలు