Subbayya Gari Hotel: సుబ్బయ్య.. ఇంత గబ్బు ఏందయ్యా? ఎలా తింటున్నార్రా బాబు!

సుబ్బయ్య గారి హోటల్‌కు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న సుబ్బయ్య గారి హోటల్‌లో తెలంగాణ టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విజువల్స్ బయటపడ్డాయి. ఆ హోటల్‌లో పరిశుభ్రత లేదని అధికారులు తెలిపారు.

New Update
subbayya gari hotel in kondapur gachibowli

subbayya gari hotel in kondapur gachibowli

సుబ్బయ్య గారి హోటల్‌లో భోజనం అంటే మామూలుగా ఉండదు. ఆ హోటల్‌లో ఫుల్ మీల్స్ ఒక్కటే కాదు హోటల్‌ కూడా ఫేమస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో లెక్కలేనన్ని బ్రాంచ్‌లు ఉన్నాయి. తింటే సుబ్బయ్య భోజనమే తినాలి.. అనేంతలా ఈ హోటల్ పాపులర్ అయింది. ముఖ్యంగా కాకినాడలో సుబ్బయ్య హోటల్‌కి చాలా క్రేజ్. అది ఇప్పుడు హైదరాబాద్ వరకూ విస్తరిచింది. 

ఇది కూడా చదవండి: AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!

తెలుగు రాష్ట్రాల్లో నోరూరించే ఫుడ్ ఏదన్నా ఉంది అంటే.. అది సుబ్బయ్య గారి భోజనమే అని చెప్తారు. కాకినాడలో ప్రారంభమైన ఈ హోటల్.. ఇప్పుడు వైజాగ్, విజయవాడ, సూర్యాపేట, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో విస్తరించింది. ఈ హోటల్‌లో వెజ్ మీల్స్‌కి భోజన ప్రియులు పడిచచ్చిపోతారు. అంతటి టేస్ట్ ఉంటుంది మరి. నోరూరించే రుచి, ఆకలి తీర్చే క్వాంటిటి వల్ల ఈ హోటల్ బాగా ఫేమస్ అయింది. 

ఇది కూడా చదవండి:AP News: SC వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!

సుబ్బయ్య హోటల్‌కు షాక్

ఈ హోటల్‌లో ఒక్కసారి భోజనం చేశారంటే.. మళ్లీ మళ్లీ అక్కడకే వెళ్లాలి అనేంతలా ఉంటుంది. ఆహా ఇదేం భోజనం రా బాబు.. ఎంత తిన్నా తినాలనే అనిపిస్తుంది అని అంటారు. అలాంటి హోటల్ ఇప్పుడు దారుణంగా తయారైనట్లు అధికారుల తనిఖీలో బయటపడింది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో కాకినాడ సుబ్బయ్య హోటల్‌లో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో సంచలన విజువల్స్ బయటపడ్డాయి. 

Also Read :  లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..

అపరిశుభ్రంగా ఉన్న కిచెన్‌తో పాటు డ్రైనేజీ వాటర్ పొంగుతున్నట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా కుల్లిపోయిన కూరగాయలు, ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచిన వస్తువులను ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ హోటల్‌ యాజమాన్యం లైసెన్స్ కూడా డిస్‌ప్లే చేయనట్లు గుర్తించారు. అలాగే హోటల్ స్టాఫ్ సైతం హ్యాండ్ గ్లోవ్స్, హెడ్ కాప్స్ ధరించలేదని తెలిపారు. దీంతో ఆ హోటల్‌లో పరిశుభ్రత లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. 

వంటగది ప్రాంతం చాలా అపరిశుభ్రంగా ఉన్నట్లు కనుగొన్నారు. అలాగే ఫ్లోరింగ్ అస్తవ్యస్తంగా, విరిగిపోయినట్లు కనిపించింది. గోడలు సైతం అపరిశుభ్రంగా.. ఎగ్జాస్ట్ నుండి నూనె కారుతున్నట్లు గుర్తించారు. స్టోర్ రూమ్ సైతం చిందరవందరగా ఉందని తెలిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisment
తాజా కథనాలు