AP BREAKING: తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య
తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు.
తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు.
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణం ఎంప్లాయిస్ కాలనీలో గురువారం రాత్రి ఏసీబీ రైడింగ్ తీవ్రసంచలనం కలిగించింది. సోషల్ వెల్ఫేర్ కాలేజీ హాస్టల్ వార్డెన్ నాగమణి రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. ఝాన్సీ అనే ఉద్యోగి నుండి లంచం తీసుకుంటూ నాగమణి ఏసీబీకి చిక్కారు.
ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి.. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 27న ఆయా స్థానాలకు ఎన్నిక జరగనుంది. అదే నెల 3 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.
వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. జగన్ బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు. పిటిషన్ పై నేడు ధర్మాసనం విచారించింది.
బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుది కోనసీమ జిల్లా రావులపాలెం. ఈయన గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల మరణించారు. నిన్న అంటే జనవరి 25వ తేదీన ఆయన పెద్ద కర్మ జరుగుతుండగా ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రకటన వెలువడింది.
ఏపీలోని ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బైరావపట్నం వద్ద నివసిస్తున్న సంచార జాతులకు చెందిన దాదాపు పది గుడిసెలు దగ్ధం అయ్యాయి. చంటి పిల్లవాడికి పాలు కాద్దామని గ్యాస్ స్టవ్ అంటించగా అకస్మాత్తుగా మంటలు ఎగసిపడినట్లు తెలుస్తోంది.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పాస్పోర్టు ఆఫీస్ ఉండాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లో కొత్త గా ఏర్పాటు చేసిన పాస్పోర్టు ఆఫీస్ ను అరకు ఎంపీ గుమ్మా తనూజారాణి అరకు ఎమ్మెల్యే రెగ మత్స్యలింగం ప్రారంభించారు.
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్లకు అంతు చిక్కని వైరస్ సోకింది. లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గంట ముందు ఆరోగ్యంగా ఉన్న కోళ్లు ఎలాంటి లక్షణాలు లేకుండా చనిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ యజమానులు, చికెన్ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇదే జరిగితే చంద్రబాబును కేంద్ర మంత్రిగా చేసి.. పవన్ ను సీఎం చేయాలని డిమాండ్లు చేయడం సంచలనంగా మారింది.