Selfie Video : సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడు....పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం

స్మార్ట్‌ఫోనుల పుణ్యమా అని చావులను కూడా ప్రత్యక్ష ప్రసారం చేసే కలికాలం దాపురించింది. ఆర్థికసమస్యలు, గొడవలు, అప్పులు ఇలా సమస్య ఏదైనా కానీ ఓ సెల్ఫీవీడియో తీసుకొని అందరికీ పంపి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. పశ్చిమగోదావరిజిల్లాలో అలాంటి వీడియోనే కలకలం రేపింది.

New Update
 selfie video

selfie video

Selfie Video : స్మార్ట్‌ ఫోనుల పుణ్యమా అని చావులను కూడా ప్రత్యక్ష ప్రసారం చేసే కలికాలం దాపురించింది. ఆర్థికసమస్యలు, గొడవలు, అప్పులు ఇలా సమస్య ఏదైనా కానీ ఓ సెల్ఫీ వీడియో తీసి అందరికీ పంపి మరి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా లోనూ అలాంటి వీడియోనే కలకలం రేపింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పోగోట్టుకున్న ఓ యువకుడు చనిపోతున్నానంటూ తన బంధవులకు వీడియో పంపడంతో అతనికోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also Read: తీరు మార్చుకోని అగ్రరాజ్యం..మరోసారి సంకెళ్లతోనే వారిని భారత్ కు పంపిన వైనం!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా, కొవ్వూరు మండలం, బంగారుపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు పేరుపాలెం బీచ్‌ లో సూసైడ్‌ చేసుకుని చనిపోతున్నానంటూ తన బంధువులకు సెల్ఫీ వీడియో పంపించాడు. కంగారు పడ్డ బంధువులు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పేరుపాలెం బీచ్‌లో మొగల్తూరు పోలీసులు గాలింపులు చేపట్టారు.

Also Read: వారి సాయం లేకుండా మేం బతకడం కష్టమే.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

ఆ యువకుడు తన సెల్పీ వీడియోలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. అయితే ఇంత వరకు అతని ఆచూకీ లభ్యం కాలేదు. అప్పులు చేసి ఆన్ లైన్ బెట్టింగ్ ఆడానని.. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు పేరుపాలెం సముద్రం ఒడ్డున ఒక బైకు కనిపించింది. దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ బైక్‌ యువకుడిదిగా భావిస్తున్నారు. సెల్ఫీ వీడియో తీసిన వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా, కొవ్వూరు మండలం, బంగారుపేట గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. బీచ్‌లో యువకుడి ఆనవాళ్లేవి దొరకకపోవడంతో అతని ఇంటికి వెళ్లడానికి పోలీసులు సిద్ధమయ్యారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత అన్ని విషయాలు మీడియాకు వెళ్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Also Read : పెయింటర్ కాదు పాపిష్టోడు.. భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం : సంగారెడ్డిలో దారుణం

Advertisment
తాజా కథనాలు