BIG BREAKING: జనసేన ఎమ్మెల్యేకు సీరియస్.. హైదరాబాద్‌కు తరలింపు!

జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాయకర్‌ను కుటుంబ సభ్యులు భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. టైఫాయిడ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు.

New Update
V BREAKING

breaking news

పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నాయకర్‌ను భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. వైద్యులు అతనికి పరీక్షలు నిర్వహించగా.. టైఫాయిడ్ ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో నాయకర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

ఇది కూడా చూడండి: Kishan reddy: సీఎం రేవంత్ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

ఇటీవల ప్రమాదం నుంచి బయట పడి..

ఇదిలా ఉండగా ఇటీవల ఓ ప్రమాదం నుంచి బొమ్మిడి నాయకర్ బయటపడిన విషయం తెలిసిందే. అమరావతిలోని ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా కారు ప్రమాదం జరిగింది. మచిలీపట్నం దగ్గర కారు వెళ్తుండగా బైక్ అడ్డు రావడంతో కారు ముళ్ల పొదల్లోకి వెళ్లింది. అదృష్టం కొలది బొమ్మిడి నాయకర్ ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ఇది కూడా చూడండి: AP Love case: ప్రియుడి కోసం పోటీ.. విషం తాగిన ఇద్దరు యువతులు.. చివరికి ఏమైందంటే!

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు