/rtv/media/media_files/2025/02/15/SYL3JB55t36YYScUhSre.jpg)
BIG BREAKING: దెందులూరు టీడీపీ(Denduluru TDP) ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్(MLA Chinthamaneni Prabhakar)పై సీఎం చంద్రబాబు(CM Chandrababu) తీవ్రస్థాయిలో సీరియస్ అయ్యారు. బుధవారం రాత్రి ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన చింతమనేని ప్రభాకర్ కారుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి(YCP Abbayya Choudhary) కారు అడ్డుగా ఉండడంతో వివాదం తలెత్తింది. దీనిపై సీఎం చంద్రబాబుకు వివరించేందుకు మంగళగిరి టీడీపీ ఆఫీసు(TDP Office)కు వచ్చారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సీఎం చింతమనేనిపై అసహనం వ్యక్తం చేశారు. మనం అధికారంలో ఉన్నామని గుర్తుంచుకోవాలని... సహనంతో వ్యవహరించాలని.. ఇలా మాట్లాడితే ఎలా అంటూ సీఎం ఫైరయ్యారు. తప్పును తప్పని చెప్పడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని చెప్పిన కేవలం బూతులు ఒక్కటే మార్గం కాదని తెలిపారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని హితవు పలికారు.
Also Read : వల్లభనేని వంశీ అరెస్ట్..ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు!
అబ్బయ్య చౌదరిపై అట్రాసిటీ కేసు
ఇదే ఘటనలో దెందులూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో అట్రాసిటీ కేసు నమోదైంది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారు డ్రైవర్ సుధీర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు పోలీసులు . ఎమ్మెల్యే కారు అడ్డుకోవడం, దౌర్జన్యం, బెదిరింపులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి ఓ వివాహ కార్యక్రమంలో ఘర్షణ జరిగిందని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: Tariffs: ట్రంప్ టారీఫ్ లతో భారత్ కు నష్టమా...లాభమా?
మరోవైపు సీఎం చంద్రబాబు ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ లో భాగంగా చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఉ.11.45 గంటలకు కందుకూరు టీఆర్ఆర్ కాలేజీలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లి 12.05కు దూబగుంట శివారులోని వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత మార్కెట్ యార్డుకు చేరుకొని ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు సీఎం.
Also Read: Cinema : మ్యూజిక్ డైరెక్టర్ తమన్కు బాలయ్య బిగ్ సర్‌ప్రైజ్!
Also Read: Horoscope Today:ఈ రోజు ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్!