Bird flu: ఏపీలో ఆగని బర్డ్ ప్లూ.. 95 గ్రామాల్లో పిట్టల్లా రాలిపోతున్న నాటు కోళ్లు!

ఏపీలో బర్డ్ ప్లూ విజృంభిస్తోంది. గోదావరి జిల్లాలో లక్షల్లో ఫారం కోళ్లు చనిపోగా తాజాగా నాటుకోళ్లకు వ్యాధి సోకుతోంది. పందెం పుంజులు సైతం పిట్టల్లా రాలిపోతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కోరుతున్నారు. 

New Update
Bird Flu Outbreak In Telangana, Wanaparthy 4000 Chickens Died at Poultry

Bird flu increasing in AP

Bird flu: ఏపీలో బర్డ్ ప్లూ విజృంభిస్తోంది. గోదావరి జిల్లాలో ఇప్పటికే లక్షల సంఖ్యలో ఫారం కోళ్లు మృత్యువాత పడ్డాయి. చికెన్ అమ్మకాలు తగ్గిపోగా వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లుతోంది. అయితే ఇప్పుడు ఫారం కోళ్ళకే కాకుండా నాటు కోళ్ళకు బర్డ్ ప్లూ సోకుతుంది. నాటు పెట్టలతో పాటు లక్షలు విలువచేసే పందెం కోళ్ళు సైతం చనిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంబేద్కర్ కోనసీమజిల్లాలో అధిక సంఖ్యలో నాటు కోళ్ళు మృత్యువాత పడ్డట్లు అధికారులు తెలిపారు. రాజోలు దీవిలో నాటుకొళ్ళకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకడంతో నాటు కోళ్ల పెంపకం దారులు లబోదిబో అంటున్నారు. గత 15 రోజుల నుంచి దాదాపు 95 గ్రామాల్లో నాటుపుంజులు, పెట్టలు పిట్టల్లా రాలిపోతుండగా లక్షల్లో నష్టపోతున్నామని కన్నీరు పెట్టుకుంటున్నారు. 

5 లక్షల మేర నష్టం..

ఈ మేరకు నాటు కోళ్లు వ్యాపారులు ఒక కోడిని పెంచడానికి పిల్లదశను నుండి సంవత్సర కాలం పాటు బాదం, పిస్తా, జీడిపప్పు కిస్మిస్, గుడ్లు మేతలు వేస్తారు. పందెం కోళ్ళకు ప్రత్యేక ఖర్చు పెడతారు. అయితే ఇప్పుడు బర్డ్ ప్లూ వైరస్ సోకడంతో సుమారు 40 కోళ్లు చనిపోయాయని లబోది మంటున్నారు వ్యాపారులు. వైరస్ వల్ల కోళ్లు చనిపోవడంతో సుమారు 5 లక్షల మేర నష్టపోయామని కోటేశ్వరరావు అనే రైతు తెలిపాడు. ప్రభుత్వం ఇప్పటికైనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కోరారు. 

ఇది కూడా చదవండి: SLBC: సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ ఫోన్.. SLBC ఘటనపై ఏం చెప్పారంటే!

చేపలకు మేతగా చనిపోయిన కోళ్లు..

వ్యాధి సోకి చనిపోయి కోళ్ల లెక్కలు లక్షల్లో నమోదవుతుంటే లెక్కించిన కోళ్లు చాలా ఉన్నాయని వాపోతున్నారు. అయితే చనిపోన కోళ్లను చేపల చెరువుల్లో చేపలకు మేతగా వేస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం ఏకే మల్లవరం లో చేపల చెరువుల్లో మృత్యువాత పడుతున్న బర్డ్ ప్లూ కోళ్లు దర్శనమివవ్వడం సంచలనం రేపింది. గొల్లప్రోలు మండలం చెందుర్తిలో అధిక సంఖ్యలో ఒక కోళ్ళఫాంలో బర్డ్ ప్లూ సోకి కోళ్ళు మృత్యువాత పడటంతో వాటిని చేపల చేరువులో వేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: New Ration Cards: కొత్త రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. మంత్రి కీలక ప్రకటన!

Advertisment
తాజా కథనాలు