Ap Crime News: ఏపీలో మహాశివరాత్రి వేళ విషాదం.. నదిలో స్నానానికి వెళ్లి 10 మంది మృతి!

మహాశివరాత్రి పర్వదినాన రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తీవ్ర విషాదాలు చోటుచేసుకున్నాయి. నదిలో స్నానాలకు వెళ్లి తూర్పుగోదావరి, ఏలూరు, నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన దాదాపు 10 మంది మృతి చెందారు. వారి మృతితో ఆయా గ్రామాల్లో విషాధ ఛాయలు అలముకున్నాయి.

New Update
east godavari

Mahashivratri festival East Godavari, Eluru, Nellore and NTR districts 10 people died


మహాశివరాత్రి పండుగ రోజున నదీ స్నానాలకు వెళ్లి రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో దాదాపు పది మంది మరణించారు. వివిధ కారణాల చేత వీరు మృత్యువాత పడ్డారు. పండుగ రోజే విషాదం జరగడంతో ఆయా కుటుంబ సభ్యులు కంటనీరు పెడుతున్నారు. ఎంతపని చేశావయ్యా పరమేశ్వరా అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో విషాధ ఛాయలు అలముకున్నాయి. 

ఇది కూడా చూడండిఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

తూర్పు గోదావరి జిల్లా

తూర్పు గోదావరి జిల్లా తాడిపూడిలో మహాశివరాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీంతో అక్కడే ఉన్న గోదావరిలో స్నానాలు చేసేందుకు దాదాపు 12 మంది యువకులు ఉదయం 7.30 సమయంలో వెళ్లారు. అందులో ఐదుగురు సుమారు 30 అడుగుల భారీ ఊబిలో చిక్కుకొని మృతి చెందారు. వారు.. గర్రే ఆకాష్‌ (19), పడాల దుర్గాప్రసాద్‌ (19), పడాల సాయి (19), తిరుమలశెట్టి పవన్‌ (17), అనిశెట్టి పవన్‌ గణేశ్‌(19)గా గుర్తించారు.

ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!

కాగా వీరంతా గోదావరి నదిలోకి స్నానానికి వెళ్తారు. మొదట ముగ్గురు ఊబిలో చిక్కుకున్నారు. ఇక వారిని రక్షించేందుకు మరో ఇద్దరు వెళ్లారు. వారు కూడా ఆ ఊబిలో చిక్కుకున్నారు. మిగిలిన వాళ్లు వెనక్కి వెళ్లి జరిగిన విషయాన్ని స్థానికులకు చెప్పారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, మత్స్యకారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇలా మధ్యాహ్నం సమయానికి ఐదుగురి మృతదేహాలు బయటపడ్డాయి.

ఇది కూడా చూడండి: Aadi Pinishetty: భార్యతో ఆది పినిశెట్టి విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో

ఏలూరు జిల్లాలో విషాదం

మరోవైపు ఏలూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. లింగపాలెం మండలం నరసన్నపాలెం పంచాయతీ తిమ్మక్కపాలేనికి చెందిన పేరిచర్ల మునికుమార్‌(22), పేరిచర్ల మురళి(19) సోదరులు తమ్మిలేరు వద్దకెళ్లారు. అందులో స్నానం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందారు.

నెల్లూరు జిల్లా

అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కూడా విషాదం జరిగింది. ఆత్మకూరుకు చెందిన ఐనబట్టిన యశ్వంత్‌(15) పదో తరగతి చదువుతున్నారు. ఒకవైపు మహాశివరాత్రి, మరోవైపు అదే రోజు స్నేహితుడి పుట్టినరోజు కావడంతో ఫ్రెండ్స్‌తో సంగం మండలం కోలగట్ల వద్ద పెన్నానదికి వెళ్లారు. యశ్వంత్‌తో పాటు తమ స్నేహితులంతా నదిలో ఈతకు దిగారు. ఈ క్రమంలో నదీ ప్రవాహానికి కొట్టుకుపోయారు. వారిలో నలుగురు బయటపడగా.. యశ్వంత్ మృతి చెందాడు. 

ఎన్టీఆర్‌ జిల్లా

మరో విషాదంలో తండ్రీ కొడుకు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొళ్లికూళ్లకు చెందిన పెరుగు చిన్న గురవయ్య (35) కుమారుడు వాసు (11) శివమాల వేసుకున్నారు. 45 రోజుల దీక్ష పూర్తిచేసుకున్న సందర్భంగా శ్రీశైలం వెళ్లారు. శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం ఈగలపెంట వద్ద కృష్ణానదిలో స్నానాలకు దిగారు. అందులోనే ప్రమాదశాత్తు మునిగి మృతిచెందారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు